స్క్రాప్ గోడౌన్లో సేఫ్టీ పరికరాలు లేవు: సికింద్రాబాద్ బోయిగూడ ప్రమాదంపై సీవీ ఆనంద్

Published : Mar 23, 2022, 10:45 AM ISTUpdated : Mar 23, 2022, 12:44 PM IST
స్క్రాప్ గోడౌన్లో సేఫ్టీ పరికరాలు లేవు: సికింద్రాబాద్ బోయిగూడ ప్రమాదంపై సీవీ ఆనంద్

సారాంశం

సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్లో  11 మంది సజీవ దహనం కావడానికి ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారని సీపీ  సీవీ ఆనంద్ చెప్పారు. 

హైదరాబాద్:  సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్లో మంటలు వ్యాపించిన సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్ చెప్పారు.

బుదవారం నాడు ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత హైద్రాబాద్ సీపీ  CV Anand మీడియాతో మాట్లాడారు. Scrap Godown షార్ట్ సర్క్యూట్ తో  మంటలు వ్యాపించాయి.  ఆ తర్వాత సిలిండర్ పేలుడు వాటిల్లిందని సీపీ ఆనంద్ చెప్పారు. మరో వైపు ఈ సమయంలో మృతులు నిద్రలోనే ఉన్నారని సీపీ చెప్పారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గోడౌన్లు చాలా ఉన్నాయని CP చెప్పారు.  

ప్రమాదం జరిగిన గోడౌన్ కు  ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందన్నారు. అంతేకాదు Godown ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా  Bihar  రాష్ట్రంలోని చప్రా జిల్లాకు చెందినవారుగా సీపీ చెప్పారు. ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని సీపీ తెలిపారు.నాలుగైదు ఏళ్లుగా బీహార్ నుండి కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారని సీపీ చెప్పారు. 

ఇవాళ ఉదయం సికింద్రాబాద్ బోయిగూడలోని  స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో  11 మంది సజీవ దహనమయ్యారు.  సుమారు మూడు గంటలకు పైగా 8 ఫైరింజన్లు  మంటలను ఆర్పివేశాయి. మంటలను ఆర్పివేసినా కూడా మళ్లీ మంటలు వ్యాప్తి చెందాయి.  మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే  వీరికి నివాసానికి అద్దె ఇల్లు లభించని కారణంగా ఈ గోడౌన్ పై భాగంలో  నివసిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వైపు గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవు. అయితే ఇంతకాలం ఈ విషయమై అధికారులు ఏం చర్యలు తీసుకొన్నారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.గోడౌన్లో సేఫ్టీ పరికరాలు లేకపోతే ఎందుకు యజమానిపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

సంఘటన స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తదితరులు సందర్శించారు. మృతదేహలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత మృతదేహలను బంధువులకు అప్పగించనున్నారు. రెండు మృతదేహాలు మాత్రమే గుర్తించే పరిస్థితి ఉంది. మిగిలిన మృతదేహలు గుర్తించే పరిస్థితిలో లేవని వైద్యులు చెప్పారు.  ఈ మృతదేహలను గుర్తించడానికి  డిఎన్ఏ టెస్టు అవసరమనే అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. 


 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..