
హైదరాబాద్: దీపావళి తర్వాత జరిగే సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. Sadar Festival సంబురాలకు నగరవాసులు సన్నద్ధమవుతున్నారు. Hyderabadకే ప్రత్యేకమైన సదర్ సంబురాలు ఈ సారి ఘనంగా జరగనున్నాయి. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా వేడుకలు చిన్నబోయాయి. కానీ, ఈ సారి మళ్లీ సదర్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి Yadav సంఘాలు సిద్ధమవుతున్నాయి. దున్నపోతులను ముస్తాబు చేసి ఊరేగిస్తారు. వీటి వెంట యువత కేరింతలు కొడుతూ చప్పుళ్లతో డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తుంటారు. రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని హల్ చల్ చేస్తుంటారు. పెద్ద సదర్ వైఎంసీఏ జరుగుతుంది. వైఎంసీఏతోపాటు ఖైరతాబాద్, ఇతర ప్రాంతాలు సహా నగర శివారుల్లోనూ సదర్ ఉత్సవాలు జరుగుతాయి. ఇటీవలే కొన్ని జిల్లాల్లోనూ సదర్ వేడుకలు ఇప్పుడిప్పుడే నిర్వహిస్తున్నాయి.
యేటా దీపావళి పండుగ తర్వాత రెండు రోజులకు నగరంలో సదర్ సంబురాలు డ్యాన్సులు, కేరింతలతో ఉత్సాహంగా జరుగుతాయి. నగరంలోనూ ముఖ్యంగా నారాయణగూడ వైఎంసీఏ దగ్గర ఈ సంబురాలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల కోసం ఇప్పటికే Haryana నుంచి బలిష్టమైన Bullsను నగరానికి తెచ్చారు. ఈ నెల 6వ తేదీన జరిగే వేడుకల కోసం అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ ప్రత్యేకంగా హర్యానా నుంచి కింగ్, సర్తాజ్ దున్నపోతులను తెచ్చి పెంచుతున్నారు. వీటి ధర రూ. 16 కోట్లు అని తెలిసింది.
Also Read: భాగ్యనగరంలో ఘనంగా సదర్ ఉత్సవాలు... దున్నపోతుల ఆటలతో సందడి (ఫోటోలు)
ఈ సారి వేడుకల్లో కింగ్, సర్తాజ్ దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కింగ్ బరువు 1500 కిలోలు. 15 అడుగు పొడగు, 5.6 అడుగుల ఎత్తు ఉన్నది. సర్తాజ్ బరువు 1600 కిలోలు. ఇది కూడా 15 అడుగుల పొడుగు, ఏడు అడుగుల ఎత్తు ఉన్నది. వీటికి యాపిల్స్, పాలు, బెల్లం, పప్పులు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కేవలం ఆహారం కోసం రోజుకు మూడు వేల రూపాయాలు వెచ్చిస్తున్నారట. ఆవాల నూనెతో మర్దనం చేస్తున్నారని తెలిసింది. ప్రతి రోజు స్నానం చేయిస్తూ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నారు. వాటి నుంచి వీర్యాన్ని తీసుకుని విక్రయిస్తున్నట్టు తెలిసింది.
Also Read: చార్మినార్ దగ్గర సండే ఫండే.. నేటి నుంచి ప్రతి ఆదివారం.. ట్రాఫిక్‌పై ఆంక్షలు
సదర్ చరిత్ర ఇదే..
హైదరాబాద్‌లో గొల్ల, కుర్మల ఐక్యత లక్ష్యంగా సదర్ వేడుకలు పుట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానున్న గొల్ల, కుర్మలను ఏకం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలకు చౌదరి మల్లయ్య యాదవ్ జీవం పోశారు. 1946లో ఈ వేడుకలు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. నిజాం కాలంలోనూ గొల్ల, కుర్మలు కలుసుకుని తమ పశుసంపదపై చర్చలు చేసుకునేవారు. గొల్ల, కుర్మలు శ్రద్ధతో పెంచిన తమ పశుసంపదను ప్రదర్శించడమే సదర్ వేడుకల్లో ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. ఆవాల నూనెతో మర్దన చేసి.. కొమ్ములు, దేహాన్ని అలంకరించి, పూల మాలలు వేసి దున్నపోతులను ఊరేగిస్తారు. తమ తమ పశుసంపదను ప్రదర్శనకు పెడుతారు. యాదవులందరికీ ఇది ప్రతిష్టాత్మకమైన వేడుక. వారందరూ తప్పకుండా ఈ సంబురాల్లో పాల్గొంటారు. సదర్ వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకర్షిస్తాయి.