కరోనా దెబ్బ: గాంధీభవన్ వారం పాటు మూసివేత

By narsimha lodeFirst Published Jul 15, 2020, 2:58 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో వారం రోజుల పాటు కార్యక్రమాలు బంద్ చేయనున్నారు. కరోనాతో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి చెందారు. దీంతో కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో వారం రోజుల పాటు కార్యక్రమాలు బంద్ చేయనున్నారు. కరోనాతో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి చెందారు. దీంతో కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.

బుధవారం నాడు ఉదయం నుండి గాంధీ భవన్ ను శానిటేషన్ పనులు ప్రారంభించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. వారం రోజుల పాటు గాంధీ భవన్ ను మూసివేయనున్నారు.

also read:అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా నిర్ధారణ: ఫ్యామిలీ, గ్రామస్థుల్లో భయం  

మూడు రోజుల తర్వాత గాంధీభవన్ లో కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కరోనా నుండి కోలుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు కరోనా నుండి కోలుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ కరోనాతో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో 37,745 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాటికి 1524కి కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి.జీహెచ్ఎంసీతో పోటీ పడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు నమోదౌతున్నాయి.

click me!