కొమరం భీమ్, ములుగు జిల్లాల్లో మావోలు, పోలీసుల మధ్య కాల్పులు: తప్పించుకొన్న నక్సల్స్

By narsimha lodeFirst Published Jul 15, 2020, 12:49 PM IST
Highlights

 కొమరంభీమ్, ములుగు జిల్లాల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య  ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల నుండి మావోయిస్టులు తృటిలో తప్పించుకొన్నారు. తప్పించుకొన్న మావోల కోసం పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు.


కొమరంభీమ్: కొమరంభీమ్, ములుగు జిల్లాల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య  ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల నుండి మావోయిస్టులు తృటిలో తప్పించుకొన్నారు. తప్పించుకొన్న మావోల కోసం పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు.

కొమరం భీమ్ జిల్లాలోని తిర్యానీ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు తప్పించుకొన్నారు. 

మంగి అటవీ ప్రాంతం ఏజెన్సీ గ్రామంలోని ఓ ఇంట్లో దాక్కున్న మావోయిస్టులపై పోలీసులు దాడి చేశారు.  అయితే ఈ దాడి నుండి మావోయిస్టులు తప్పించుకొన్నారు. పోలీసుల నుండి తప్పించుకొన్న వారిలో మావోయిస్టు రాష్ట్ర కమిటి సభ్యులు అడెల్లు అలియాస్ భాస్కర్ ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. మంగి అటవీ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నాయి.

తిర్యాణి మండలం తుక్కు గూడ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడ్డారని తప్పించుకునే క్రమంలో కాల్పులకు యత్నించారని  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. 

మావోల వద్ద ఏకే47, ఎస్ఎల్ఆర్ తుపాకులు ఉన్నాయన్నారు. తప్పించుకున్న వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్, ఏరియా కమిటీ సభ్యులు వర్గీష్, మంగు, అజయ్ ఉన్నారని విష్ణు వారియర్ వెల్లడించారు. 

వారిని పట్టుకునేందుకు పోలీసు బలగాలు అణువణువునా గాలిస్తున్నాయన్నారు. మావోయిస్టులకు ఎవరూ సహకరించొద్దని.. వారి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు.

ములుగు జిల్లాలో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తాడ్వాయి-ఏటూరునాగారం అడవుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు బలగాలు గాలిస్తున్నాయి. 
 

click me!