తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు జూలై 16 వరకు హైకోర్టు బ్రేక్

By narsimha lodeFirst Published Jul 15, 2020, 1:15 PM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను ఈ నెల 16వ తేదీ వరకు నిలిపివేయనున్నట్టు హైకోర్టు తెలిపింది.సచివాలయం కూల్చివేత పనులపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.
 


హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను ఈ నెల 16వ తేదీ వరకు నిలిపివేయనున్నట్టు హైకోర్టు తెలిపింది.సచివాలయం కూల్చివేత పనులపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.

అదనపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. చిక్కుడు ప్రభాకర్, ప్రొఫెసర్ విశ్వేశ్వరావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. ఈ నెల 13వ తేదీ వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని ఈ నెల 10వ తేదీన హైకోర్టు ఆదేశించింది.

ఈ నెల 13వ తేదీన తెలంగాణ హైకోర్టు ఈ విషయమై విచారణ చేసింది. సచివాలయం కూల్చివేత పనులపై మంత్రివర్గ తీర్మానాన్ని సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించింది. 

బుధవారం నాడు హైకోర్టులో సచివాలయం కూల్చివేత పనులపై  విచారణ చేసింది. అదనపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీతో పాటు అన్ని శాఖల అనుమతులు తీసుకొన్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

also read:జూలై 13 వరకు సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: తెలంగాణ హైకోర్టు ఆదేశం

కేబినెట్ తీర్మానం కాపీని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది ఇదివరకే అందించారు.  సచివాలయం కూల్చివేత పనుల విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. రేపటి వరకు కూల్చివేత పనులపై స్టే కొనసాగనుంది.

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సీఎం కేసీఆర్ రెండు రోజులుగా ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

click me!