హైదరాబాద్‌లోని ఇష్తా సిటీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

By Sumanth KanukulaFirst Published Jan 16, 2022, 1:06 PM IST
Highlights

హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్తా సిటీ అపార్ట్ మెంట్‌లో ఆదివారం మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్తా సిటీ అపార్ట్ మెంట్‌లో ఆదివారం మంటలు చెలరేగాయి.  521 ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇందుకు సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

మంటల భారీగా ఎగసిపడటంతో.. ఇంట్లోని సామాగ్రి అంతా పూర్తిగా దగ్దమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అగ్ని కీలలు భారీగా ఎగసిపడటంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించి.. పూర్తిగా దగ్దమైంది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల్లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. 

అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1878లో బ్రిటీష్‌ హయాంలో మిలటరీ అధికారులు కోసం ఈ క్లబ్‌ నిర్మించారు.. దాదాపు 20 ఎకరాల విస్తీరణంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ను నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు. ఈ క్లబ్‌లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. శనివారం సెలవు కావడంతో..క్లబ్‌లో కేవలం కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా క్లబ్ మెంబ్స్ తెలిపారు.

click me!