హైదరాబాద్‌లో కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. ఆ యువతి బంధువుల పనేనా?

Published : Jul 03, 2022, 02:35 PM ISTUpdated : Jul 03, 2022, 03:08 PM IST
 హైదరాబాద్‌లో కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. ఆ యువతి బంధువుల పనేనా?

సారాంశం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జిన్నారం అడవుల్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తుంది. 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జిన్నారం అడవుల్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మృతదేహం కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డిదిగా గుర్తించారు. వివరాలు.. మృతుడు నారాయణరెడ్డి కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం అతడు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి నారాయణరెడ్డిని పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. 

ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో నిర్భందించారు. అయితే ఆ తర్వాత కూడా నారాయణ రెడ్డి, యువతి ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు, బంధువులు నారాయణరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసి, పెట్రోల్ పోసి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?