రేపు సంచలన నిర్ణయం.. రాహుల్‌కు ఇచ్చిన మాట తప్పినందుకు బాధగా ఉంది: జగ్గారెడ్డి

Published : Jul 03, 2022, 01:38 PM IST
రేపు సంచలన నిర్ణయం.. రాహుల్‌కు ఇచ్చిన మాట తప్పినందుకు బాధగా ఉంది: జగ్గారెడ్డి

సారాంశం

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పానన్న ఆవేదనలో ఉన్నానని చెప్పారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ టూర్‌కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ టార్గెట్‌గా ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే నేడు మరోసారి జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పానన్న ఆవేదనలో ఉన్నానని జగ్గారెడ్డి చెప్పారు. 

రేవంత్ వ్యవహారం వల్లే మాట తప్పాల్సి వచ్చిందని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో.. ఆయన ఏం చెప్పబోతున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఆయన పార్టీ గుడ్ బై చెబుతారనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజిక్ కాన్స‌ర్ట్‌.. ఎక్క‌డ జ‌ర‌గ‌నుంది.? టికెట్ ధ‌ర ఎంతంటే.
హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?