ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి: రాజకీయ తీర్మాణంపై ప్రసంగంలో అమిత్ షా

By narsimha lodeFirst Published Jul 3, 2022, 1:35 PM IST
Highlights

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి రానుందని ఆ పార్టీ ధీమాను వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ ఏపీ, తెలంగాణ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా వారసత్వ రాజకీయాలకు కూడా ముగింపు పలకనున్నట్టుగా చెప్పారు. 

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బెంగాల్, కేరళ, ఒడిశా, తెలంగాణ, ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టనున్నట్టుగా బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది. తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలకు ముగింపు త్వరలో రానుందని అసోం సీఎం Himanta Biswa Sarma చెప్పారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను Assam CM  హిమంత బిశ్వ శర్మ ఆదివారం నాడు  మీడియాకు వివరించారు. BJP జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  రాజకీయ తీర్మానాన్ని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shah  ప్రవేశ పెట్టారు.  ఈ తీర్మానాన్ని కర్ణాటక సీఎం Bommai , అసోం సీఎం హిమంత బిశ్వ శర్మలు బలపరుస్తూ ప్రసంగించారు.  ఈ తీర్మానంతో పాటు జాతీయ కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను బిశ్వ శర్మ మీడియాకు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో పేదరికం బాగా తగ్గింది. ఆరోగ్య రంగంలో భారత్ 2026 నాటికి అగ్రగామిగా నిలుస్తుందని ఆయన చెప్పారు.భారత విదేశాంగ విధానం దేశ హితం కోసం రూపొందించినట్టుగా ఆయన చెప్పారు. Andha Pradesh, Keralaలో కూడా అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

పనితీరు ఆధారిత రాజకీయాలు ఇప్పుడు సాగుతున్నాయన్నారు.పాలసీ పారాలసిస్ నుండి విముక్తి లభించిందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి దాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని హిమంత బిశ్వ శర్మ విమర్శించారు.. ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తున్న విషయాన్ని అసోం సీఎం గుర్తు చేశారు.Narendra Modi నేతృత్వంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని  బిశ్వంత శర్మ చెప్పారు. 

 తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. కేసీఆర్ విమర్శలకు ధీటైన సమాధానం చెబుతామని ఆయన చెప్పారు. దేశాన్ని మార్చడానికి కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో కూడా 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలోక ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ తీర్మానం ప్రవేశ పెడుతూ అమిత్ షా చెప్పారు. కులం, మతం, కుటుంబ ఆధిపత్య రాజకీయాల నిర్మూలనకు తమ పార్టీ కృషి చేయనుందని అసోం సీఎం చెప్పారు. ఈ విషయమై చర్చించామన్నారు.

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: 119 నియోజకవర్గాల్లో అగ్ర నేతల కేంద్రీకరణ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం అత్యంత కీలకమైంది.ఈ రాజకీయ తీర్మాణంలో  ఇప్పటి వరకు అధికారంలో లేని రాష్ట్రాలపై అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నాయకత్వం చర్చించింది. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారంలో లేని రాష్ట్రాల నేతలకు పార్టీ నాయకత్వం కీలక సూచనలు చేసింది.ఈ రాష్ట్రాల్లో పాలక పక్షాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా బీజేపీ నిర్ణయం తీసుకుంది. మరో వైపు 8 ఏళ్లలో మోడీసర్కార్ చేపట్టిన  అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయనున్నారు.తెలంగాణ రాష్ట్రంపై కూడా బీజేపీ అగ్ర నాయకత్వం కేంద్రీకరించింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీజేపీ అగ్ర నేతలు  దిశా నిర్ధేశం చేయనున్నారు. గుజరాత్ రాష్ట్రం మోడల్ ను తెలంగాణలో అమలు చేయనున్నారు. 
 

click me!