
హైదరాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ లో ఆదీవాసీ మహిళ మృతి చెందిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.
రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీన ఆదీవాసీ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
ఈనెల 19న రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివాసీ మహిళ జయశీల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కడుపులో ఉన్న కవలలు కూడా మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ తరుణంలో గవర్నర్ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
గద్వాలకు చెందిన గర్భిణీ రెడ్ జోన్ ప్రాంతం నుండి వచ్చిందని ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించారు. హైద్రాబాద్ పేట్లబురుజు ఆసుపత్రిలో చేరిన తర్వాత డెలీవరీ అయింది. అప్పటికే ఆలస్యం కావడంతో తల్లీ బిడ్డ మరణించారు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే.