నేటి నుండే తెలంగాణ మహా కుంభమేళా: మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు

By narsimha lode  |  First Published Feb 16, 2022, 10:51 AM IST

మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19వ తేదీ వరకు జాతర కొనసాగనుంది.జాతరకు సుమారు కోటిన్నర భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


వరంగల్: Medaram జాతర బుధవారం నాడు  అంగరంగంగా  ప్రారంభం కానున్నాయి. జాతరకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18వ తేదన తెలంగాణ సీఎం KCR మేడారం లో సమ్మక్క, సారలమ్మను దర్శించుకొంటారు.Sammakka,Saralamma జాతరకు హాజరయ్యే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

మేడారం జాతరకు సుమారు కోటిన్నరకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులు Corona ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లి నుండి పూజారులు సమ్మక్క, ఆమె కొడుకు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు.

Latest Videos

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుండి సంప్రదాయ నృత్యరీతులతో సమ్మక్క భర్త పగిడిద్దరాజును పాదయాత్రగా పూజారులు మేడారానికి తీసుకు వస్తున్నారు. 24 గంటల తర్వాత పగిడిద్దరాజు ఇవాళ సాయంత్రానికి మేడారానికి చేరుకొంటారు. జాతర మొదటి రోజైన ఇవాళ కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెపైకి తీసుకు వస్ారు. ఈ నెల 17న సమ్మక్కను  చిలుకల గుట్ట నుండి సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజున సమ్మక్క, సారలమ్మలు భక్తులకు దర్శనమిస్తారు.

1996లో మేడారం జాతరను అధికారిక పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1940 నుండి మేడారం జాతర సాగుతుందని  ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. మేడారం జాతరకు తొలుత భక్తులు ఎడ్లబండ్లపై వచ్చేవారు. అయితే ఈ జాతరకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాయి.  

వన దేవతలను దర్శించుకొనేందుకు ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీష్‌ఘడ్,మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరౌతారు. 2012 నుండి మేడారం జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.హైద్రాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, హన్మకొండ పట్టణాల నుండి మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులను రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు జాతరలో పాల్గొంటారు.

జాతర ప్రాంగంణంలో రూ. 75 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు. ఈ జాతరకు 4 వేల RTC బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతుంది.  Jataraకు వచ్చే భక్తుల కోసం 327 ప్రాంతాల్లో  20 వేలకు పైగా శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం  1100 ఎకరాలను సిద్దం చేశారు. 32 ఎకరాల్లో బస్ స్టేషన్ ను ఏర్పాటు చేవారు. జంపన్న వాగు వరకు 25 బస్సులు నిరంతరం నడిచేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. 

click me!