నిబంధనలకు విరుద్దంగా పబ్‌లు నడిపితే చర్యలు: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ వార్నింగ్

Published : Dec 24, 2021, 04:07 PM ISTUpdated : Dec 24, 2021, 04:33 PM IST
నిబంధనలకు విరుద్దంగా పబ్‌లు నడిపితే చర్యలు: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ వార్నింగ్

సారాంశం

నిబంధనలకు విరుద్దంగా పబ్ లు నడిపితే  కఠినంగా వ్యవహరిస్తామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు పబ్ లు నడపవద్దని కూడా ఆయన కోరారు. 


హైదరాబాద్: నిబంధనలకు విరుద్దంగా పబ్ లు నడిపితే కఠిన చర్యలు తీసకొంటామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.శుక్రవారం నాడు Hyderabad సీపీ Anjani kumar  మీడియాతో మాట్లాడారు. పబ్‌ల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.కొన్ని పబ్‌లపై ఫిర్యాదులు అందాయన్నారు. Pub ల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని ఆయన కోరారు.

రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసకొంటామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి వరకు నడిపే పబ్‌లపై చర్యలు తీసుకొంటామన్నారు.పబ్‌ల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని సీపీ తెలిపారు.తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకొంటామని  ఆయన హెచ్చరించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని కూడా ఆయన సూచించారు.

also read:హైదరాబాద్‌ పబ్‌లో యువతితో యువకుల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

నివాస ప్రాంతాల్లో పబ్‌ల విషయమై జూబ్లీహల్స్ రెసిడెన్షియల్ అసోసియేష్ ఇటీవల  Telangana High courtలో ఇటీవలనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు పబ్ ల యజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది.

జనావాసాల మధ్య పబ్‌లు నడుపుతున్నారని.. నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 2000 నిబంధనలు ఉల్లంఘించారని కోర్టుకు బుధవారం విచారణ సందర్భంగా రెసిడెన్షియల్ అసోషియేషన్ తెలిపింది. 

నగరంలోని  800 జూబ్లీ,హైలైఫ్, బ్రెవింగ్ కంపెనీ, పర్జీ కెఫే, అమ్నిషీయా లాంజ్, డైలీ డోస్ బార్ హాఫ్, డర్టీ మార్టినీ కిచెన్ , బ్రాడ్ వే పబ్, మ్యాకే బ్రో వరల్డ్ కాపీ బార్, పబ్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నగరంలోని పలు పబ్‌లలో అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకొంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి.  మైనర్లకు కూడా పబ్‌లలో మద్యం అమ్మిన దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారం జరిగింది. పబ్‌లలో డ్రగ్స్ కూడా విక్రయించినట్టుగా ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో హైకోర్టు పబ్ లకు నోటీసులు జారీ చేయడంతో హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ విషయమై స్పందించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?