
రంగారెడ్డి : నమ్మించి, మద్యం తాగించి rape attemptకి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. చివరకు cc cameraల ఆధారంగా దొరికిపోయిన నిందితుడు.. ఇంటి అప్పు తీర్చేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, షాబాద్ సీఐ అశోక్ గురువారం తెలిపారు. షాబాద్ మండలం పోతుగల్ కు చెందిన కామారెడ్డి జయమ్మ (40) ఈ నెల 20న శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ లో బంధువుల గృహప్రవేశానికి వెల్తుండగా అదే గ్రామానికి చెందిని కేశపల్లి మల్లారెడ్డి.. తానూ బుల్కాపూర్ వెల్తున్నానని చెప్పి ఆమెను బైక్ మీద ఎక్కించుకున్నాడు.
మార్గమధ్యలో ఆమెకు liquor తాగించాడు. దీంతో జయమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె మెడలోని పుస్తెల తాడు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చిన జయమ్మ ప్రతిఘటించింది. దీంతో చీరకొంగు మెడకు బిగించి హతమార్చాడు. తరువాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కాళ్ల కడియాలు, పట్టాగొలుసులు తీసుకుని పరారయ్యాడు. కాగా, జయమ్మ భర్త జంగయ్య భార్య కనిపించడం లేదని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా, కేశపల్లి మల్లారెడ్డి ఆమెను బైకు మీద తీసుకువెల్తున్నట్లు కనిపించింది. దీంతో మల్లారెడ్డిని గురువారం అదపులోకి తీసుకుని విచారించగా, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ అశోక్ మీడియాకు వెల్లడించారు.
నల్గొండలో విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఆత్మహత్య చేసుకొన్న తండ్రి
ఇదిలా ఉండగా, సైబర్ నేరాలకు పాల్పడుతూ అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులుఅరెస్ట్ చేశారు. Instagram లో యువతులను మోసం చేస్తున్న అజయ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో యువతి Profile photoతో ఖాతా తెరిచిన అజయ్.. అమ్మాయిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడినట్టు తేలింది. యువకుడిని అమ్మాయిగా భావించిన యువతులు వారి ఫొటోలను పంపించారు.
వారి Nude pictures పంపించకపోతే మార్ఫింగ్ చేస్తానని... కోరిక తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని threatsకు పాల్పడ్డాడు. ఈ మేరకు 15 రోజుల క్రితం అజయ్ పై సైబర్ క్రైం పోలీసులకు నగరానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్ సుఖ్ నగర్ లో అజయ్ ని అరెస్ట్ చేశారు.
నిందితుడు అజయ్ వరంగల్ జిల్లా పరకాల వాసిగా పోలీసులు గుర్తించారు. అజయ్ హైదరాబాద్ లో మల్టీ మీడియా కోర్సు చేస్తున్నాడు. అజయ్ ఇప్పటివరకు చాలామంది యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.