టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ శుభవార్త: సినిమా టిక్కెట్ ధరల పెంపుకు ఓకే, గరిష్ట ధర ఎంతో తెలుసా..?

By Siva KodatiFirst Published Dec 24, 2021, 3:42 PM IST
Highlights

తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరల (cinema ticket rates) పెంపుకు ప్రభుత్వం (telangana govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరల (cinema ticket rates) పెంపుకు ప్రభుత్వం (telangana govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏసీ థియేటర్లలో (ac theaters ) కనిష్ట ధర రూ.50, గరిష్ట ధర రూ.150గా వుండనుంది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో (multiplex theatre) కనిష్ట ధర రూ.100, గరిష్ట ధర రూ.250గా వుండనుంది. మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా రూ.300గా నిర్ణయించారు.

వీటికి జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు వుండనున్నాయి. నిర్వహణ ఛార్జి కింద ఏసీ థియేటర్లలో టిక్కెట్‌పై రూ.5, నాన్ ఏసీ థియేటర్లలో టిక్కెట్‌పై రూ 3 వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తే మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250కి అదనంగా జీఎస్టీ, ఆన్‌లైన్ టికెటింగ్ వసూలు చేసే కన్వీనియెన్స్ రుసుం, నిర్వహణ ఛార్జీలు అదనం కానున్నాయి. 

నిర్మాతల విజ్ఞప్తి మేరకు మూవీ టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణలోని అన్ని థియేటర్‌లలో సినిమా టికెట్‌ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

click me!