MET Gala 2021 : తళుక్కుమన్న మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి..

By AN Telugu  |  First Published Sep 15, 2021, 10:07 AM IST

మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ యేడాది భారత్ నంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితదులు పాల్గొన్నారు. 


అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో ఆమె మెరిశారు. 

ఈ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’. భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ఈ డ్రెస్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ యేడాది భారత్ నంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. 

Latest Videos

ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితదులు పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్  ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’ కు తగ్గట్టు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుని, షేన్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించింది. 

click me!