వచ్చేయేడు ఖైరతాబాద్ లో 70అడుగులతో మట్టి గణపయ్య.. నిమజ్జనం అక్కడే..!

By AN TeluguFirst Published Sep 15, 2021, 9:55 AM IST
Highlights

మంగళవారం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా  మట్టి గణపతి ఏర్పాటుపై  ఉత్సవ కమిటీ ప్రతినిధులతో చర్చించారు. పర్యావరణం, నిమజ్జనంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు.  

ఖైరతాబాద్ : ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్(పీఓపీ) విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ప్రథమ పౌరురాలు గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది మట్టి గణపతి ని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు అంగీకరించారని మేయర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

మంగళవారం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా  మట్టి గణపతి ఏర్పాటుపై  ఉత్సవ కమిటీ ప్రతినిధులతో చర్చించారు. పర్యావరణం, నిమజ్జనంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు.  

ఆమె విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించారు.  ఈ మేరకు మేయర్ కార్యాలయం తెలిపింది.  వచ్చే ఏడాది  ఖైరతాబాద్ లో  70 అడుగుల  మట్టి గణపతిని ప్రతిష్టించి  అక్కడే నిమజ్జనం చేయాలనే ఆలోచన ఉందని చైర్మన్ సింగారి సుదర్శన్,  కన్వీనర్ సందీప్ రాజు తెలిపారు.

కాగా, హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించి గందరగోళనం నెలకొన్న నేపథ్యంలో భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి తేల్చిచెప్పింది. కోర్టు తీర్పులకు కాదని జల్లికట్టు లాంటి పండుగలను నిర్వహిస్తున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు గుర్తు చేశారు. 

ఖైరతాబాద్ మహాగణపతికి పగడి ముస్తాబు.. ఇదే తొలిసారి..

శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే హైదరాబాద్ గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొంటారని భగవంతరావు వివరించారు.

రసాయనాలను రోజు వెదజల్లే కంపెనీలను ఆపలేని కోర్టులు & ప్రభుత్వాలు ఒక్క రోజు నిమజ్జనం ఆపటానికి అడ్డంకి ఎందుకో? అని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకపోతే వేరే చెరువుల్లో చేయవచ్చు అని కోర్ట్ సమాధానం ఐతే మరి ఆ చెరువులు కూడా కలుషితం అవుతాయి అని తెలియదా? ఇంత వరకు రసాయనాలు రోజు వెదజల్లే కంపెనీలకు నోటీసులు కూడా ఇవ్వని కోర్ట్ తీర్పులు , ప్రభుత్వ ఆర్డర్లు ఎక్కడ ? అని భగవంతరావు ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచి మట్టి గణపతినే పెట్టాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఉన్నచోటునే మండపంలోనే నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. 

click me!