కూతురిని బెదిరించి.. మూడేళ్లుగా అత్యాచారం..!

Published : Sep 15, 2021, 09:41 AM IST
కూతురిని బెదిరించి.. మూడేళ్లుగా అత్యాచారం..!

సారాంశం

భర్త నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న మహిళ 2017లో అంబర్ పేటకు చెందిన వ్యాపారి(45) ని పెళ్లి చేసుకుంది.

బెదిరించి.. కూతురిపై ఓ కసాయి తండ్రి మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. అంతు చూస్తామంటూ బెదిరించడం గమనార్హం. అతను సవతి తండ్రి కావడం గమనార్హం. కాగా.. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని తాజాగా అరెస్టు చేశారు. ఈ సంఘటన చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇన్ స్పెక్టర్ కె. ఎన్. ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పాత బస్తీ బండ్లగూడలోని గౌస్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు(14), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న మహిళ 2017లో అంబర్ పేటకు చెందిన వ్యాపారి(45) ని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే వివాహం కాగా.. భార్యతో అంబర్ పేటలో ఉంటున్ానడు. అప్పుడప్పుడూ గౌస్ నగర్ లోని రెండో భార్య వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు.

ఈ క్రమంలో మూడేళ్ల నుంచి ఈ మహిళ కూతురును భయపెట్టి అత్యాచారినికి పాల్పడుతూనే ఉన్నాడు . ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ నెల 13వ తేదీన ఈ దుశ్చర్యను తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం