మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కు 10 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం

Published : Mar 28, 2023, 02:45 PM IST
మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కు 10 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం

సారాంశం

Hyderabad: హైదరాబాద్ లో మహిళా జర్నలిస్టులకు 10 రోజుల ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్రభుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రోగనిర్ధారణ పరీక్షలలో రక్త పరీక్షలు (సీబీపీ), రక్తంలో చక్కెర, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ 12, డీ 3 తో పాటు ఈసీజీ,  ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్ అండ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయి.  

Free medical camp for female journalists: హైదరాబాద్ లో మహిళా జర్నలిస్టులకు 10 రోజుల ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్రభుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

వైద్య శిబిరంలో రక్త పరీక్షలు (సీబీపీ), రక్తంలో చక్కెర, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ 12, డీ 3 తో పాటు ఈసీజీ,  ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్ అండ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయి. వీటితో పాటు వైద్య శిబిరంలో కంటి స్క్రీనింగ్, దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన జర్నలిస్టులుగా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న మహిళలందరూ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం (ఐ అండ్ పీఆర్ విభాగం) ప్రధాన కార్యాలయంలో పది రోజుల పాటు (మార్చి 29- ఏప్రిల్ 7) మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 10 రోజుల పాటు మహిళలు తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ శిబిరం కొనసాగుతుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu