ఈసారి కవిత బతుకమ్మ ఆడేది తీహార్ జైల్లోనే..: కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలనం

Published : Mar 28, 2023, 01:50 PM IST
ఈసారి కవిత బతుకమ్మ ఆడేది తీహార్ జైల్లోనే..: కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలనం

సారాంశం

డిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే కేంద్ర విచారణ సంస్థల ఎదుట హాజరైన కేసీఆర్ కూతురు అరెస్టవడం ఖాయమని బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

నల్గొండ :డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న   తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విచారణ సంస్థల ముందు హాజరైన కవిత జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. ఆమె ఈసారి బతుకమ్మ పండగను తీహార్ జైల్లో ఆడుకోవాల్సి వుంటుందని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేసారు. 

బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని గత తొమ్మిదేళ్లుగా దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ దోపిడీ గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా బయటకు తీసే పనిలో వున్నాయని... తప్పు చేసినట్లు తేలితే ఎంతటివారైనా జైలుకు పోతారని అన్నారు. కాబట్టి డిల్లీ లిక్కర్ స్కాం తో సంబంధమున్న కవిత జైలుకెళ్లడం ఖాయమని ... ఇందులో తనకు ఎలాంటి అనుమానం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ల లీక్ వ్యవహారంపైనా రాజగోపాల్ రెడ్డి స్పందించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యుల ప్రమేయమున్న ఈ ప్రశ్నపత్రాల లీక్ పై సిట్ విచారించినా అసలు నిజాలు బయటకు రావన్నారు. అసలు ఈ సిట్ పైనే తమకు నమ్మకం లేదని... సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేసారు. 

ఇదిలావుంటే డిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే కవిత పలుమార్లు ఈడీ విచారణకు హాజరుకాగా ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చివరిసారి ఈడీ విచారణకు హాజరైన సమయంలో కవిత తాను వాడిన కొన్ని సెల్ ఫోన్లను అధికారులకు అందజేసారు. విచారణకు హాజరయ్యే ముందు మీడియాకు కవర్లలో ప్యాక్ చేసిన సెల్ ఫోన్లను చూపించి కార్యాలయంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లలో లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డాటా ఏమైనా వుందేమో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కవితకు తాజాగా ఈడీ అధికారులు లేఖ రాసారు. 

Read More మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా కవితకు రాసిన లేఖలో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవిత తన తరపున ఈడీ కార్యాలయానికి లాయర్ సోమా భరత్‌ను పంపారు. దీంతో భరత్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
 
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 11, 20, 21 ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు కవితను విచారించారు. ఆ తర్వాత ఈడీ అధికారులు మళ్లీ కవితకు నోటీసులు జారీచేయలేదు. కానీ తాజాగా సెల్ ఫోన్ల డాటా సేకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

డిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు బయటపడ్డప్పటి నుండి ఆమె అరెస్టవుతారని బిజెపి నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈడీ విచారణ సమయంలో అయితే ఈ అరెస్ట్ ప్రచారం మరింత ఎక్కువగా జరిగింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కవిత అరెస్ట్ ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు