
పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం గుట్టలుగుట్టలుగా భయటపడుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ బ్లాక్ మనీ బాగోతాలు బయటపడుతునాయి. అయితే ఇందులో చాలా వరకు బోగస్ అని ఐటీ అధికారులు చెబుతున్నారు.
మంగళవారం నగరానికి చెందిన బాణారపు లక్ష్మణ్‌రావు తన దగ్గర రూ.9,800 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఈ విషయాన్ని తేల్చేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.
వారి విచారణలో లక్ష్మణ్‌రావు ఓ సెలబ్రెటీకి బినామీగా గుర్తించారు.లక్ష్మణ్‌రావు చార్టెడ్ అకౌంటెంట్‌గా చెబుతున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కూడా తన వద్ద రూ.200 కోట్లు ఉన్నట్లు ఐటీ అధికారులకు తెలిపాడు. ఈ రెండింటిపై విచారణ చేపట్టిన ఐటీ అధికారులు ఇదంతా బోగసేనని నిర్ధారించారు.
ఇటీవల గుజరాత్‌కు చెందిన మహేశ్ షా కూడా ఇలానే తన వద్ద వేల కోట్ల రూపాయిలు ఉన్నట్లు ఐటీ అధికారులకు స్వచ్ఛంధ ఆదాయ పథకం కింద వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని అధికారులు బోగస్ గా తేల్చారు.