
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ రాష్ట్రంలోని మొదటి క్యాష్ లెస్ గ్రామంగా అవతరించనుంది. మంత్రి హరీశ్ రావు దత్తత తీసుకున్న ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే తొలి క్యాష్ లెస్ విలేజ్ గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగా ఈ గ్రామంలో అన్ని లావాదేవీలను ఇకపై ఆన్ లైన్ లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఇబ్రహీంపూర్ లో 1200 మందికి బ్యాంకు అకౌంట్లతో పాటు డెబిట్ కార్డులు, స్వైపింగ్ మిషన్లు జారీ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇబ్రహీంపూర్ ను క్యాష్ లెస్ గ్రామంగా ప్రకటించడంపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో క్యాష్ లెస్ లావాదేవీలను పరిశీలించినట్లు చెప్పారు. మిగిలిన గ్రామాలకు ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.