ఈటెల ఎఫెక్ట్ : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్... వరుస రాజీనామాలు.. (వీడియో)

By AN TeluguFirst Published Jun 10, 2021, 3:56 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. నియోజక వర్గంలో అన్ని మండలాల టీఆర్ఎస్వీ అధ్యక్షులతో పాటు నియోజక వర్గ అధ్యక్షుడు ఆ పార్టీ కి రాజీనామా చేశారు. అనంతరం జమ్మికుంట లో భారీ ర్యాలీ నిర్వహించి, స్థానిక గాంధీ చౌరస్తా వద్ద రాజీనామాను ప్రకటించారు.

"

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తరువాత నియోజక వర్గం లో రాజకీయం వెడెక్కుతుంది. రాజీనామ ప్రకటన తరువాత ఈటల రెండు రోజులు హుజూరాబాద్ లో పర్యటించారు. అనంతరం హుజూరాబాద్ నియోజక వర్గంలో టిఅర్ఎస్వి, టిఆర్ఎస్ వై నాయకులు జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  

స్థానిక గాంధీ చౌరస్తా వరకు జై ఈటల నినాదాలతో మారుమ్రోగించారు. అయితే కరోనా దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మూకుమ్మడిగా రాజీనామలు చేశారు. మొదటి నుండి ఉద్యమం చేసిన ఈటలను బర్తరఫ్ చేసి ఉద్యమ లో పాల్గొనని నాయకులకు పదవులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ను హుజూరాబాద్ నియోజక వర్గానికి వచ్చే నాయకులను అడ్డుకుంటామని అన్నారు.
 
click me!