నెహ్రూ జూ పార్కులో 83 ఏళ్ల ఏనుగు మృతి.. 1938లో జననం, నిజాం కానుక

By Siva KodatiFirst Published Jun 10, 2021, 3:17 PM IST
Highlights

హైదరాబాద్ జూ పార్క్‌లో జంతువులు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. పార్కులో ఏనుగు, చిరుత పులి చనిపోయాయి. వయసు పై బడటంతో... వృద్ధాప్యం కారణంగా 83 సంవత్సరాల రాణి అనే (ఆడ) ఏనుగు మృతి చెందింది.

హైదరాబాద్ జూ పార్క్‌లో జంతువులు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. పార్కులో ఏనుగు, చిరుత పులి చనిపోయాయి. వయసు పై బడటంతో... వృద్ధాప్యం కారణంగా 83 సంవత్సరాల రాణి అనే (ఆడ) ఏనుగు మృతి చెందింది. జూపార్కుకు వచ్చే సందర్శకులకు ఇది ఓ ఆకర్షణగా ఉండేది. ఏనుగులు సర్వ సాధారణంగా అడవుల్లొ 70 సంవత్సరాల లొపు జీవిస్తాయి. అయితే జూ పార్కులో ఉండటం .. ప్రత్యేకంగా ఆహరం, వైద్యుల సంరక్షణ కారణంగా రాణి 83 సంవత్సరాల వరకు జీవించినట్లుగా అధికారులు చెబుతున్నారు.

Also Read:కరోనాతో సింహం మృతి: జూ సిబ్బందికి టెస్టుల్లో నెగిటివ్, మరి సింహాలకి ఎలా సోకింది..?

ఏసియాటిక్ జాతికి చెందిన ఈ ఏనుగును ఏడవ నిజాం జూపార్కుకి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నగరంలో జరిగే మొహర్రం, బోనాల ఊరేంగిపుతో పాటుగా పలు సంప్రదాయ ఉత్సవాలకు ఈ గజరాణినే ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. 7 జులై 1938లో జన్మించిన ఈ ఏనుగును గతేడాది జులైలో సినీ నటుడు రామ్‌చరణ్ దత్తత తీసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతోనే ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు. సాధారణంగా చిరుత పులులు 15 నుండి 18 సంవత్సరాల పాటు జీవిస్తాయి. అయ్యప్ప అనే ఈ చిరుత 21 సంవత్సరాల వయసు వరకు జీవించడం విశేషం.

click me!