
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా బూరుగుపల్లిలో గాయపడిన చిరుతను హైద్రాబాద్ జూపార్క్ కు తరలించారు ఫారెస్ట్ అధికారులు. గురువారం నాడు ఉదయం కోయిల్‌కొండ మండలం బూరుగుపల్లి శివారులో గాయాలతో చిరుతపులి కన్పించింది. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
also read:బూరుగుపల్లి శివారులో చిరుత కలకలం: భయాందోళనలో స్థానికులు
పశువులను వేటాడే క్రమంలో చిరుతపులి గాయపడిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పశువులు పులిపై ఎదురు దాడి చేయడంతోనే పులి గాయపడింది. పశువులు మేత మేస్తున్న సమయంలో పులి దాడికి ప్రయత్నించింది. అయితే ఏడు పశువులు పులిపై ఎదురు దాడికి దిగాయి. పశువులు పులిపై దాడి చేయడంతో పులి వెన్నెముకకు గాయాలయ్యాయి.ఫారెస్ట్ అధికారులు పులికి మత్తుమందు ఇచ్చి పులిని హైద్రాబాద్ జూపార్క్ కు తరలించారు. పులి గాయాలు నయమైన తర్వాత అడవిలో విడిచిపెడతామని ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు.
బూరుగుపల్లి శవారులో గాయపడిన చిరుతకు నీరు, మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు అందించారు. తీవ్రంగా గాయపడిన చిరుతపులి కదలలేని స్థితిలో ఉంది. దీంతో పులికి చికిత్స అందించేందుకు ఫారెస్ట్ అధికారులు జూపార్క్ కు తరలిచంారు. వారం రోజుల్లోనే పులి గాయాలు నయమయ్యే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.