హుజూరాబాద్‌లో పోటీకి కొండా సురేఖ నో: తెరపైకి ముగ్గురి పేర్లు

By narsimha lodeFirst Published Oct 1, 2021, 12:27 PM IST
Highlights

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ముగ్గురి పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఈ స్థానం నుండి కొండా సురేఖ పోటీకి విముఖతను చూపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పత్తి కృష్ణారెడ్డి, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, వ్యాపారవేత్త రవికుమార్ ల పేర్లను పరిశీలిస్తోంది కాంగ్రెస్.

హైదరాబాద్:  హూజురాబాద్ (huzurabad bypoll) అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి కొండా సురేఖ (konda surekha)విముఖత చూపడంతో   పోటీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్ధుల కోసం కాంగ్రెస్  (congress )పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది.

also read:రేవంత్‌కు షాక్.. హుజురాబాద్‌లో పోటీ చేయలేను: తేల్చిచెప్పేసిన కొండా సురేఖ

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్ధిత్వం వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. అయితే  ఈ స్థానం నుండి పోటీకి ఆమె విముఖతను చూపింది.  ఈ విషయాన్ని గురువారం నాడు సాయంత్రం  కొండా సురేఖ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పింది.

 అయితే కొత్త అభ్యర్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషణను మొదలు పెట్టింది.  హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పత్తి కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త రవికమార్,ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పేరును కూడ కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
  
ఈ విషయమై పీసీసీ ఎన్నికల కమిటీ  పీసీసీ తమ సిఫారసునును పంపింది.  అయితే ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో చర్చించి నిర్ణయం తీసుకొంటారు.  మాణికం ఠాగూర్ తో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు భేటీ అయి అభ్యర్ధి ఎంపికపై చర్చిస్తున్నారు.


 

click me!