TSRTC... ఆర్టిసి ఉద్యోగులకు గుడ్ న్యూస్...ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Oct 1, 2021, 11:36 AM IST
Highlights

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ అందించారు. సంక్షోభంలో వున్న సంస్ధను గాడిలో పెట్టే పనిని ఉద్యోగుల సమస్యల పరిష్కారం నుండే ప్రారంభించారు సజ్జనార్.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TSRTC)ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ సంస్థను గాడినపెట్టే చర్యలు ప్రారంభించారు. అయితే ఆర్టీసిలో పనిచేసే ఉద్యోగుల సహకారం లేకుండా సంస్థను గాడిన పెట్టడం సాధ్యంకాదని భావించిన ఆయన ముందుగా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఉద్యోగ వేతనాల విషయంలో సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

గత కొన్నేళ్లుగా ఆర్టీసి ఉద్యోగులకు వేతనాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. ఆ సంస్థ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందడంలేదు. దాదాపు సగం నెల గడిచిన తర్వాత అంటే 10 నుండి 15వ తేదీలోపు విడతల వారీగా జీతాలు అందుతున్నారు. దీంతో ఆర్టీసి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సజ్జనార్ ముందుగా ఉద్యోగుల జీతాల సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టారు. 

read more  బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. టికెట్ తీసుకుని మరీ.. (వీడియో)

ఈ క్రమంలోనే ఆర్టిసి ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు.  ఈ నెల(అక్టోబర్) 1వ తేదీనే అంటే ఇవాళే తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులందరికీ జీతాలు అందే ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి నేడే ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానున్నాయి. ఇదే జరిగితే ఆర్టిసి ఉద్యోగులు మూడేళ్ల తర్వాత మళ్లీ ఒకటో తేదీన జీతాలు అందుకున్నట్లు అవుతుంది. 

నూతన ఎండీ చొరవతో ఆర్టిసి ఉద్యోగుల ఇళ్ళలో దసరా పండగ ముందుగానే రానుంది. తమ సమస్యను గుర్తించి పరిష్కరించిన సజ్జనార్ పై ఉద్యోగులు ప్రశంసలు కురిస్తున్నారు. పండగల సమయంలో సకాలంలో జీతాలు అందే ఏర్పాటు చేయడంపట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

click me!