Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు, ఎవరి కొంపముంచుతారో?

By narsimha lode  |  First Published Oct 14, 2021, 1:01 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 30 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ముగ్గురు మినహా 27 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. అయితే 27 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఏ పార్టీ ఓట్లను చీల్చుతారనే విషయమై ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో భయం నెలకొంది.


కరీంనగర్: Huzurabad bypoll నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మొత్తం 30 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు నిన్ననే చివరి రోజు కావడంతో 12 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు.  

also read:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు: హుజురాబాద్‌ బరిలో 37 మంది.. బద్వేల్‌లో 15 మంది

Latest Videos

undefined

అయినా కూడ 30 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.  అయితే ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే ఉంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్ధులు చీల్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతోEtela rajenderను మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ నుKcr తప్పించారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేశారు. అదే నెల 14న  రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.ఈ నెల 30 వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ రెండున ఓట్లను లెక్కించనున్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి దాఖలైన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13వ తేదీతో గడువు ముగిసింది. ఈటల రాజేందర్ సతీమణి జమున సహా 12 మంది తమ నామినేషన్లను నిన్ననే ఉపసంహరించుకొన్నారు. దీంతో బరిలో 30 మంది ఉన్నారు.  ఇందులో  ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.

ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. ఈ స్థానం నుండి 2009 నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తున్నారు. అయితే ఈ దఫా మాత్రం ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీలోకి దిగారు.

ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులను మినహయిస్తే మిగిలిన 27 మంది అభ్యర్ధులు ఇండిపెండెంట్లు లేదా గుర్తింపు లేని పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో విజయం కోసం టటీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే బరిలో ఉన్న 27 మంది ఇండిపెండెంట్లు చీల్చే ఓట్లు ఏ పార్టీ కొంప ముంచుతాయోననే ఆందోళన ప్రధాన పార్టీల్లో ఉంది.

2020 Dubbaka ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు 1431 ఓట్ల మెజారటీతో తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఇండిపెండెంట్లు ఓట్లు చీల్చడం కూడ తమకు ఈ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయంతో  గులాబీదళం ఉంది.

42 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించార. అయితే ఇందులో 10 మంది అభ్యర్ధులు రిజిస్ట్ర్ రాజకీయ పార్టీలకు చెందినవారు. ముగ్గురు ప్రధానపార్టీలకు చెందినవారు.  ఇండిపెండెంట్లను నామినేషన్లను ఉపసంహరించుకొనేలా పెద్ద ఎత్తున Bjp, Trs ప్రయత్నాలను చేసింది. అయితే కేవలం 12 మంది మాత్రమే తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. 

గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో 23 మది అభ్యర్దులు బరిలో ఉన్నారు. వీరిలో 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. ముగ్గురు అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చెందినవారు.Trs ఎన్నికల గుర్తును పోలిన గుర్తు దక్కిన ఇండిపెండెంట్ అభ్యర్ధి Bandaru Nagaraju ఈ ఎన్నికల్లో 3570 ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీల తర్వాత నాలుగవ స్థానంలో నాగరాజు నిలిచారు. 

60 ఓట్లను నాగరాజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా పొందాడు. మిగిలిన 19 మంది అభ్యర్ధులకు కేవలంల వందల్లోనే ఓట్లు దక్కాయి.  నాగరాజు తమ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి దుబ్బాకలో విజయం దక్కిందని గులాబీ పార్టీ అభిప్రాయపడుతుంది.హుజూరాబాద్ లో బరిలో ఉన్న 27 మంది ఇండిపెండెంట్లు ఏ పార్టీ ఓట్లను చీల్చుతాయనేది నవంబర్ రెండున తేలనుంది. 

click me!