కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం: గెజిట్ అమలు మరింత ఆలస్యం

Published : Oct 14, 2021, 11:24 AM ISTUpdated : Oct 14, 2021, 11:31 AM IST
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం: గెజిట్ అమలు మరింత ఆలస్యం

సారాంశం

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించే విషయమై తెలంగాణ సర్కార్ సానుకూలంగా లేదు. ఈ విషయ,మై మరికొంత సమయం తీసుకోనుంది. ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది.  

హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను  కేఆర్ఎంబీకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం మరికొంత సమయం తీసుకోనుంది. దీంతో కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులు అప్పగించే విషయమై కేసీఆర్ సర్కార్ అధ్యయనం చేయనుంది.కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను Krmbకి అప్పగిస్తే లాభనష్టాలను  తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఈ విషయమై కేసీఆర్ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది.

also read:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్: 16 ఔట్‌లెట్లకు ఓకే, కానీ...ఏపీ, తెలంగాణ వాదనలివీ...

తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ Muralidhar Rao  నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేయనుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను, పవర్ ప్లాంట్లను అప్పగిస్తే  ఏం జరగనుందనే విషయమై మురళీధర్ రావు నేతృత్వంలోని కమిటీ కేసీఆర్ సర్కార్ కు నివేదికను ఇవ్వనుంది.15 రోజుల్లో నివేదికను ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే Krishna నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయమై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్.Telangana, Andhra pradesh రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జల వివాదాలకు చెక్ పెట్టేందుకు ఈ ఏడాది జూలై 15న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ Gazette నోటిఫికేషన్ ను  జారీ చేసింది.

ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఈ నెల 11,12 తేదీల్లో Grmb, Krmbలు సమావేశాలు నిర్వహించాయి.ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు హాజరయ్యారు.

తెలంగాణ జెన్‌కో పరిధిలోని మూడు జల విద్యుత్ కేంద్రాలను  మినహా మిగిలిన వాటిని బోర్డులకు అప్పగించేందుకు కేసీఆర్ సర్కార్ సానుకూలంగా బోర్డు సమావేశాల్లో చెప్పినట్టుగా తెలుస్తోంది.Srisailam ప్రాజెక్టు పరిధిలో ఏడు, Nagarjuna sagar ప్రాజెక్టు పరిధిలోని ఎనిమిది ఔట్‌లెట్లలో గెజిట్ అమలుకు కేఆర్ఎంబీ ప్రతిపాదించింది. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగుపై గెజిట్ అమలుకు రెండు రాష్ట్రాలు సమ్మతించాయి.

రెండు  రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తేనే వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకొనేందుకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి అధికారం రానుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కార్ తీసుకొన్న నిర్ణయంతో గెజిట్ అమలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తేలింది.


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ