Telugu akademi scam: రూ.30 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు సీజ్, కీలక విషయాలు

By narsimha lodeFirst Published Oct 14, 2021, 12:13 PM IST
Highlights

తెలుగు అకాడమీ స్కాంలో పోలీసుల అదుపులో ఉన్న నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. నిందితుల నుండి కోట్లాది రూపాయాల విలువైన ఆస్తి పత్రాలను పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు రూ. 3 కోట్ల నగదును కూడ పోలీసులు సీజ్ చేశారు.


హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు కీలక విషయాలను వెల్లడించారని తెలుస్తోంది.Telugu akademi కి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను నిందితులు కొల్లగొట్టారు.ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు  పోలీసులు. అరెస్టైన 14 మందిలో తొమ్మిది మందిని Ccs పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.పోలీసుల విచారణలో నిందితులు పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం.

also read:telugua akademi:సాయికుమార్ బ్యాచ్ ట్విస్ట్, ఏపీలో రూ. 15 కోట్లు స్వాహా

ఈ స్కామ్ లో ఎవరి పాత్ర ఎలా ఉందనే విషయమై తెలుసుకొని ఆధారాలను సేకరించేందుకు పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులకు నిందితులు తెలివిగా సమాధానాలు చెప్పి కేసు నుండి తప్పించుకొనే ప్రయత్నాలు చేశారని సమాచారం.

తెలుగు అకాడమీ  అధికారులు ఫిర్యాదు చేయడంతో తన వద్ద ఉన్న రూ. 80 లక్షలను కాల్చేసినట్టుగా ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నిధులతో అప్పులు తీర్చుకొన్నానని మరో నిందితుడు దర్యాప్తులో తెలిపాడు.రూ. 50 లక్షలను తాను తన స్నేహితుడికి అప్పు ఇచ్చానని మరొకరు విచారణలో ఒప్పుకొన్నారు. అయితే అప్పు తీసుకొన్న తర్వాత తన స్నేహితుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని  దర్యాప్తులో నిందితుడు పోలీసులకు చెప్పాడు.

తెలుగు అకాడమీ నుండి స్వాహా చేసిన నిధులతో కొనుగోలు చేసిన  ప్లాట్లకు సంబంధించిన ఆస్తి పత్రాలను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. యూబీఐ, కెనరాబ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన మస్తాన్ వలీ, సాధనల నుండి  రూ. 20 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.

14 మంది నిందితుల నుండి సుమారు రూ.17 కోట్ల విలువైన పత్రాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో అరెస్టైన రాజ్‌కుమార్, సాయికుమార్, వెంకటరమణల నుండి రూ.లక్షల్లో నగదును సీజ్ చేశారు. 

ఇప్పటి వరకు నిందితుల నుండి  రూ. 3 కోట్ల నగదును సీజ్ చేశారు.తెలుగు అకాడమీలో నిధులను కొల్లగొట్టడంతో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ శాఖల నుండి రూ. 15కోట్లను కొల్లగొట్టారని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ విషయమై తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏపీకి చెందిన ఈ రెండు శాఖల అధికారులు విచారణ చేస్తున్నారు.


 

click me!