హుజురాబాద్ ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ కు సమయం దగ్గరపడిన సమయంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని... కిలో చికెన్,మందుతో ఓట్లు కొనాలని చూస్తున్నాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ కు మరో రెండురోజులు మాత్రమే మిగిలివుంది. ఇంతకాలం జోరుగా సాగిన అన్ని పార్టీల ప్రచారానికి నేటి(బుధవారం)తో బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే చివరిరోజు ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా ప్రచారం నిర్వహించాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రంగంలోకి దిగారు. ఇలా ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హుజురాబాద్ లో ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా minister srinivas goudమాట్లాడుతూ... బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్నాడని... అసలు ఆయనకు ఆత్మగౌరవం ఎక్కడుంది అంటూ ఎద్దేవా చేసారు. eatala rajender వల్ల హుజురాబాద్ లో ఒక్కరు కూడా సెకండ్ లీడర్ గా ఎదగలేకపోయారని అన్నారు. చివరకు తన కులస్తులైన ముదిరాజ్ ల కోసమైన ఈటల ఒక్కసారయినా మాట్లాడాడా? అని అడిగారు. బిసి కులాలు ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తి ఈటెల రాజేందర్ అని మంత్రి ఆరోపించారు.
undefined
వీడియో
''ఈటల లోపల ఓసి, బయట మాత్రమే బిసి. ఆయన రాజీకీయంగా ఎవ్వరిని ఎదగనీయలేదు. పుట్టినప్పటి నుండి లెప్ట్ లెఫ్ట్ అని... ఇప్పుడేమో రైట్ అని ఎలా అంటున్నారు. అయినా మంత్రిగానే ఏం చేయని వ్యక్తి ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు. ఈటల మాటల తీరుకి, నడవడికకి చాలా తేడా ఉంటుంది'' అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
read more huzurabad bypoll: ఓటర్లకు డబ్బు పంపిణీ కలకలం.. ఓటుకు రూ. 8 వేలు, వీడియో వైరల్
''ఫించన్ తిసుకునే ప్రతిఒక్కరూ telangana లో ఈరోజు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. బిసిలని ప్రొత్సహిస్తున్నది టిఆర్ఎస్ పార్టినే. బిసిలకి ఆత్మగౌరవ భవనాలను ఈ ప్రభుత్వమే కట్టించింది. విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి KCR. ప్రతి కులానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవం లభిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతోనె అట్టడుగు వర్గాలకి లబ్ది జరుగుతుంది'' అని మంత్రి అన్నారు.
''ఈటల ఎదిగిన కోళ్ళ ఫాం యజమానులే ఈరోజు టీఆర్ఎస్ కి ఓటు వెయ్యాలని తిరుగుతున్నారు. కిలో చికెన్, మందుతో ఓట్లు కొనాలని ఈటల చూస్తున్నారు. కానీ చికెన్, మందుకి ఓట్లు పడవు. హుజురాబాద్ ప్రజలు చికెన్, మందుబాటిల్లకి అమ్ముడుపోయే రకం కాదు'' అన్నారు.
read more దళిత బంధు: తాను తవ్విన గోతిలో తానే పడింది.. టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ వ్యాఖ్యలు
''స్థాయిని మరిచిపోయి ఈటల మాట్లాడుతున్నాడు. ఆయనకు ముఖ్యమంత్రి సీటు తప్పా అన్ని ఇచ్చాడు కేసిఆర్... అలాంటిది ఆయననే విమర్శిస్తున్నాడు. తెలంగాణని అతిగా ప్రేమించే వ్యక్తి కేసిఆర్. బిసిలంటే గిట్టని పార్టీ బిజేపి. బిజిలపై ప్రేముంటే బిసి జనగణన ఎందుకు చెయ్యడం లేదు? కేంద్రానికి బిసి హస్టల్, బిసి భవన్ కట్టాలని అలోచన వచ్చిందా?'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీసారు.