Huzurabad Bypoll: అబద్దాల బిజెపికి ‌- నిబద్దత గల టీఆర్ఎస్ కే పోటీ: హరీష్ రైమింగ్ పంచులు

By Arun Kumar PFirst Published Oct 8, 2021, 2:02 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్-బిజెపిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలుకు చివరిరోజయిన ఇవాళ టీఆర్ఎస్ అబ్యర్థి గెల్లు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు రైమింగ్ పంచులతో బిజెపిపై విరుచుకుపడ్డారు. 

కరీంనగర్: అబద్ధాల పార్టీ బీజేపీకి... నిబద్ధత గల టీఆర్ఎస్ పార్టీకి మద్య హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ జరుగుతోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అమ్మకాల పార్టీ బీజేపీకి - నమ్మకమైన పార్టీ టీఆర్ఎస్ కి, అరాచానికి - అభివృద్ధికి, రూపాయి బొట్టు బిల్లకు - లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మికి మద్య పొటీ జరుగుతోందని అన్నారు. ఇక్కడ గెలిచే పార్టీ టీఆర్ఎస్... అద్భుతమైన మెజారిటీతో గెలుస్తామని హరీష్ ధీమా వ్యక్తం చేసారు. 

huzurabad bypoll లో నామినేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రయ ఆరంభంలోనే రెండు సెట్లతో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేసారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి harish rao పాల్గొన్నారు.  

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రి హరీష్ మాట్లాడుతూ... హుజురాబాద్ ప్రజలనుండి తమకు అద్బుత స్వాగతం లభిస్తోందన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనుకు ఎన్నికల ఖర్చు కోసం కూడా ప్రజలే డబ్బులు ఇస్తున్నారని... పేద మహిళలు సైతం తమ ఆసరా పెన్షన్ డబ్బులు ఇస్తున్నారని హరీష్ తెలిపారు. దీన్నిబట్టే ప్రజలకు TRS పై సంపూర్ణ విశ్వాసం ఉందని అర్థం అవుతోందని... ఖచ్చితంగా గెలిచే పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. అద్భుతమైన మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. 

''హుజూరాబాద్ లో ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ బలంగా వుంది. 2001లో రైతు నాగలి గుర్తుతో ప్రజా ప్రతినిధులను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. రాజేందర్ టీఆర్ఎస్ లోకి రాకముందే కాదు ఆయన వెళ్లినా గెలిచిన పార్టీ, గెలిచే పార్టీ టీఆర్ఎస్. అబద్ధాల పార్టీ బీజేపీకి-నిబద్ధత గల పార్టీ టీఆర్ఎస్ కు మధ్య పోటీ హుజూరాబాద్ ఎన్నిక జరుగుతుంది'' అని హరీష్ అన్నారు. 

 Huzurabad Bypoll: ప్రచారంలో మంత్రి హరీష్ కు బ్రహ్మరథం... పూలవర్షంతో స్వాగతం (ఫోటోలు)

''ప్రజలకు తెలుసు... తెలంగాణలో అభివృద్ధి ఎలా జరుగుతుందో. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధికి మీరు బ్రహ్మరథం పడతారని తెలుసు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆదరిస్తారు. మేం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే తట్టుకోలేక కేసీఆర్ తమ ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తున్నారా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి bjp పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నేతలు సమాదానం చెప్పాలి'' అని హరీష్ నిలదీసారు. 

''సీఎం కేసీఆర్ విధానం సంపదను పెంచు...పేదలకు పంచు. మరి బీజేపీ విధానం పేదలను దంచు....పెద్దలకు, గద్దలకు పంచు. బీజేపీ పేదల మీద పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి భారం మోపింది. ఇలా పేదల ఉసురు పోసుకుని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు రుణమాపీ చేస్తోంది. ఇలా మేం రైతులకు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేశాం... కానీ బీజేపీ కార్పోరేట్ పెద్దలకు రుణమాఫీ చేస్తోంది'' అని ఆరోపించారు. .

 ''మీరు ఒక్క కారణమైనా చెపుతారా... బిజెపికి ఎందుకు ఓటు వేయాలని. ఉత్తరప్రదేశ్ లక్నోలో నడి రోడ్డు మీద కారు ఎక్కించి రైతులను చంపిన పార్టీ బీజేపీ. అందుకు ఓట్లు వేయాలా? ఓ కేంద్ర మంత్రి రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చినందుకు ఓట్లు వేయాలా...? హర్యానా సీఎం ఖట్టర్ రైతులను పట్టుకొని లాఠీలతో కొట్టండని చెప్పాడు... అందుకు ఓటు వేయాలా..?'' అని హరీష్ ప్రశ్నించారు. 

read more  Huzurabad Bypoll: బిగ్ షాక్... టీఆర్ఎస్ లో చేరిన ఈటల బంధువులు, కులస్తులు

''రైతుల కోస కేంద్రం కొత్త విద్యుత్ విధానం తెచ్చింది. బాయిల కాడ, బోర్ల కాడా విద్యుత్ మీటర్లు పెట్టమంటోంది. పక్కన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మీటర్లు పెడుతున్నాడు. కాని సీఎం కేసీఆర్ మాత్రం నా గొంతులో ప్రాణం ఉండగా ఇక్కడ మీటర్లు పెట్టేది లేదని చెప్పారు'' అని హరీష్ అన్నారు. 

''ఈ ఎన్నిక రైతు బాంధవుడయిన టీఆర్ఎస్ కు -  రైతుల ఉసురు తీస్తున్న రాబంధుల పార్టీ బీజేపీకి మధ్య జరుగుతోంది. బీజేపీకి ఓటు వేస్తే పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను ఆమోదించినట్లే. బీఎస్ఎన్ఎల్, రైల్వే, పోర్టులు ప్రయివేటీకరణకు సై అన్నట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోగట్టడమే అవుతుంది. దీనికి మద్ధతు ఇచ్చినట్లే'' అన్నారు. 

''కానీ టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. సంక్షేమానికి, అభివృద్ధిని ఆమోదించినట్లు. ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం... గెల్లు శ్రీను గెలుపు శ్రీను కాబోతున్నారు. వీలైనంత ఎక్కువ మెజారిటీతో గెల్లును గెలిపించండి. గెల్లుకు నేను తోడుగా ఉండి.. అభివృద్ధి, సంక్షేమంలో హుజూరాబాద్ అగ్రగామిగా తీర్చిదిద్దుతా'' అని హామీ ఇచ్చారు.

''అబద్దాలతో మాయ చేయాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తారో... సూటిగా అడిగి సమాధానాన్ని రాబట్టండి. పనిచేసే ప్రభుత్వం మీద విమర్శలు చేసి సెంటిమెంట్ తో ఓట్లు పొందాలని చూస్తున్నారు.  వ్యక్తి ప్రయోజనం కాదు..హూజురాబాద్ సంక్షేమం ముఖ్యం. మీకు సేవ చేసే అదృష్టాన్ని గెల్లు శ్రీనివాస్ కు, ఆయనతో పాటు మాకు అవకాశం ఇవ్వండి'' అని మంత్రి హరీష్ హుజురాబాద్ ప్రజలను కోరారు. 

click me!