Huzurabad Bypoll: బిజెపి అభ్యర్థిగా ఈటల జమున... మరో సెట్ నామినేషన్ దాఖలు (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 8, 2021, 11:55 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఈటల రాజేందర్ నామినేషన్ కు ముందే ఆయన సతీమణి ఈటల జమున నామినేషన్ దాఖలు చేశారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. అక్టోబర్ ఒకటిన huzurabad bypoll నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ్టితో(అక్టోబర్ 8వ తేదీ) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు రిటర్నింగ్ ఆపీసు వద్దకు చేరుకుంటున్నారు. 

ఈక్రమంలోనే భారతీయ జనతా పార్టీ(BJP) తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున మరో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. స్వయంగా హుజురాబాద్ ఆర్డివో కార్యాలయానికి విచ్చేసిన eatala jamuna నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 

ఇప్పటికే బిజెపి అభ్యర్థిగా ఈటల జమున పేరిట ఓ సెట్ నామినేషన్ దాఖలైన విషయం తెలిసిందే. జమున తరుపున బిజెపి నాయకుడు కనుకుంట్ల అరవింద్ ఓ సెట్ నామినేషన్ పత్రాలను గత సోమవారమే రిటర్నింగ్ అధికారికి అందజేసారు. తాజాగా మరో సెట్ నామినేషన్ పత్రాలను స్వయంగా ఈటల జమునే రిటర్నింగ్ అధికారికి అందజేసారు. 

వీడియో

అయితే ముందుజాగ్రత్త కోసమే ఈటల జమునతో బిజెపి నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరిరోజయిన ఇవాళ ఈటల రాజేందర్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. బిజెపి అభ్యర్థి eatala rajender అని... జమున నామినేషన్ ముందుజాగ్రత్త మాత్రమేనని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.  

read more  Huzurabad Bypoll: టీఆర్ఎస్ షాక్... నామినేషన్ల కోసం బారులుతీరిన ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు

అయితే గతంలో హుజురాబాద్ లో రాజేందర్ కాకుండా ఆయన సతీమణి జమున బరిలోకి దిగే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా జమున పేరిట రెండు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో చివరి నిమిషంలో ఈటల తప్పుకుని తన భార్యనే బరిలోకి దించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ముందుజాగ్రత్త కోసమే జమున నామినేషన్ అని బిజెపి చెబుతున్నా ఎక్కడో అనుమానం మాత్రం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో వుంది.

 ఇదిలావుంటే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన గత శుక్రవారమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్‌ చేరుకున్న గెల్లు మద్యాహ్నం హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. గెల్లు శ్రీనివాస్ వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. 

ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు)  బరిలోకి దిగనున్నారు. నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు కావడంతో ఈటల రాజేందర్ తో పాటు బల్మూరు వెంకట్ నామినేషన్ వేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఈటల నామినేషన్ కార్యక్రమంలో, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బల్మూరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 


  
 

click me!