భార్యను దారుణంగా హత్య చేసి.. గడ్డిలో చుట్టి..భర్త పరార్...

Published : Sep 23, 2021, 10:14 AM IST
భార్యను దారుణంగా హత్య చేసి.. గడ్డిలో చుట్టి..భర్త పరార్...

సారాంశం

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. కుటుంబకలహాల కారణంగా తన భార్యను హత్య చేసి.. పరారయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. 

హైదరాబాద్ : ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. కలకాలం కలిసి నడుస్తానని ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్తే కట్టుకున్నదాన్ని కర్కశంగా కాటికి పంపాడు. ఆ తరువాత భార్య శవాన్ని(Dead Body) గడ్డిలో చుట్టి (Wrapped in Grass)... భవనం పక్కన పెట్టి గప్ చుప్ గా పరారయ్యాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జరిగింది. 

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. కుటుంబకలహాల కారణంగా తన భార్యను హత్య చేసి.. పరారయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోనిి దుర్గా భవానీ నగర్ ను ఆనుకుని ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద చత్తీస్ ఘడ్ కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి(32) యేడాది కాలంగా పని చేస్తున్నారు. కాగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

భార్య మృతి.. కన్న కూతురిపై కన్నేసిన తండ్రి..!

ఈ నేపథ్యంలోనే మూడు రోజులకిందట వారిద్దరి మధ్య గొడవ తీవ్రమయ్యింది. అటల్ తన భార్య రేఖను హత్య చేసి అదే ప్లాట్ ప్రహరీ వెంబడి గడ్డిలో చుట్టి పడేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు.. జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న భర్త అటల్ పార్థీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం