ఫుడ్ కోర్ట్ బాత్రూంలో కెమెరా.. చూసి షాకైన యువతి..మూడురోజులగా 20 మంది వీడియోలు...

Published : Sep 23, 2021, 10:49 AM IST
ఫుడ్ కోర్ట్ బాత్రూంలో కెమెరా.. చూసి షాకైన యువతి..మూడురోజులగా 20 మంది వీడియోలు...

సారాంశం

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 లోని వన్ డ్రైవ్ ఇన్ లో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెడితే.. నల్లగొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18) ఓ హోటల్ లో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తన సెల్ ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసి హోటల్ లో మహిళలు ఉపయోగించే టాయిలెట్ లో పైన పెట్టాడు. దాంట్లో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఓ ఉన్న ఓ ఫుడ్ కోర్టు(Food Court)లో దారుణం జరిగింది. ఫుడ్ కోర్ట్ లోని మహిళల టాయిలెట్(Woman Toilet) లో తన సెల్ ఫోన్ పెట్టి వీడియోలు(Video Shoot) చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 లోని వన్ డ్రైవ్ ఇన్ లో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెడితే.. నల్లగొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18) ఓ హోటల్ లో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తన సెల్ ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసి హోటల్ లో మహిళలు ఉపయోగించే టాయిలెట్ లో పైన పెట్టాడు. దాంట్లో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు.

మూడు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోంది. అయితే బుధవారం ఓ యువతి ఆ సెల్ ఫోన్ ను గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. 

సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. సుమారు 20 మంది మహిళల వీడియోలు ఫోన్లో చిత్రీకరించినట్లుగా గుర్తించారు. నిందితుడిమీద నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడు రోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందా? ఇంతకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu