గెల్లుకు సొంతూర్లోనే కాదు.. అత్తగారి ఊరిలో‌నూ షాక్.. అక్కడ ఈటల ఆధిక్యం ఎంతంటే..?

By team telugu  |  First Published Nov 2, 2021, 5:26 PM IST

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చాలా చోట్ల నిరాశే ఎదురైంది. సీఎం కేసీఆర్ (CM KCR) దళిత బంధు పథకం సభ నిర్వహించిన శాలపల్లిలో టీఆర్‌ఎస్(TRS) చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై (gellu srinivas yadav) బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. ఇదిలా ఉంటే gellu srinivas yadavకు సొంతూరిలోనే గట్టి షాక్ తగిలింది.


హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చాలా చోట్ల నిరాశే ఎదురైంది. సీఎం కేసీఆర్ (CM KCR) దళిత బంధు పథకం సభ నిర్వహించిన శాలపల్లిలో టీఆర్‌ఎస్(TRS) చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై (gellu srinivas yadav) బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. శాలపల్లిలో టీఆర్‌ఎస్‌పై బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు పడగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు పడ్డాయి. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ స్వగ్రామమైన సింగాపూర్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ కూడా బీజేపీ టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. 

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

Latest Videos

undefined

ఇక, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సొంతూరిలోనే గట్టి షాక్ తగిలింది. ఆయన స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఓటర్లు ఆయనకు హ్యాండ్ ఇచ్చి.. ఈటల వైపు మొగ్గుచూపారు. హిమ్మత్‌ నగర్‌లో శ్రీనివాస్ యాదవ్‌కు 358 ఓట్లు పోలవ్వగా, ఈటల రాజేందర్‌కు 549 ఓట్లు వచ్చాయి. దీంతో ఆ ఊరిలో ఈటలదే పైచేయి. ఇదిలా ఉంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అత్తగారి ఊరిలో కూడా ఇదే రకమైన ఫలితాలు కనిపించాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అత్తగారి ఊరైన హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లెలో ఈటల రాజేందర్‌కు 76 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 

Also read: టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

మరోవైపు హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్‌కు ఈటల రాజేందర్ మెజారిటీ పెరుగుతుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. 

Also read: శత్రువుకు శత్రువు మిత్రుడు.. మాకు తప్పలేదు.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..

ఇక, Huzurabad Bypoll ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితానికి సంబంధించి ఇప్పటివరకు 17 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. అందులో 15 రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరచగా.. 2 రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ అధిక్యం సాధించారు. ఇప్పటివరకు ఈటల 14,618.. ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో 7 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది. మరో గంట రెండు గంటలలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 

click me!