
రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్నారు బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మెదక్ జిల్లా (medak district) హావేలి ఘనపూర్ (haveli ghanpur)మండలంలో శనివారం బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender) పర్యటించారు. శుక్రవారం బోగడ భూపతిపూర్‌లో (boguda bhupathipur) ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఓదార్చారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ... రైతు రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్, ఫామ్‌హౌజ్‌ల నుండి బయటకు వచ్చి శాస్త్రవెత్తలు, రైతులతో చర్చించి పంటలపై నిర్ణయం తిసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎక్కడో ఉన్న ఢిల్లీ రైతులకు సహాయం చేస్తానని చెప్పి ఇక్కడి రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారని.. కేంద్రం బియ్యం కొనమని ఎప్పుడు చెప్పలేదని రాజేందర్ స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తానని వాళ్ల కల్లల్లో కారం కొట్టాడని ఈటల మండిపడ్డారు. ముడో టీఎంసీ కోసం మళ్లీ ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల డబ్బులు దొచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజేందర్ ఆరోపించారు.
కాగా.. హావేలి ఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ లో రైతు కర్ణం రవి కుమార్ స్వయంగా కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పొలానికి నీళ్లు సౌకర్యం ఉంది. దీంతో వర్షాకాలంలో ప్రభుత్వం చెప్పినట్టు సన్నరకం వరి వేశాడు. కానీ, ఊహించని విధంగా దిగుబడి తక్కువగా వచ్చింది. అయినా సరే.. పంటకు సరైన మద్దతు రాకపోదా అని చూశాడు. కానీ, దొడ్డు రకం వడ్లు వచ్చిన ధరనే సన్నాలకు లభించింది. సరేలే అని సర్దుకుపోయాడు. యాసంగి లో పుష్కలమైన నీరు ఉంది.. మంచి దిగుబడి వస్తోందని సాగు చేయాలని భావించాడు.
కానీ తెలంగాణ సర్కార్ .. ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయొద్దని సంచలన ప్రకటన చేసింది. దీంతో ఏం పండించాలనేది అర్థం కాని గందరగోళం పడ్డారు. ఏం చేయలేని పరిస్థితిలో పురుగుల మందు తాగి రైతు కరణం రవికుమార్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఈ క్రమంలో తన బాధను వ్యక్తపరుస్తూ.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు.
’ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు యాసంగిలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. తనను ఇంజినీరింగ్ చదివియ్యాలె’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రవికుమార్ పేర్కొన్నాడు.
"