దారుణం... తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. భార్యపై పెట్రోల్ పోసినిప్పంటించిన భర్త..

Published : May 10, 2022, 08:05 AM IST
దారుణం... తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. భార్యపై పెట్రోల్ పోసినిప్పంటించిన భర్త..

సారాంశం

ఓ వ్యక్తి మద్యం డబ్బుల కోసం దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యనే కర్కశంగా కడతేర్చాడు. డబ్బులు ఇవ్వలేదని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

హైదరాబాద్ : తాగుడుకు బానిసైన ఓ భర్త money ఇవ్వలేదని భార్యను petrol పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మైలార్ దేవులపల్లి ఠాణా ఇన్స్ పెక్టర్ నరసింహ, ఎస్సై కిష్టయ్య కథనం ప్రకారం.. లక్ష్మీ గూడ రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో ఉండే మాసరాజు (56), అనితా బాయి (52) దంపతులు. కుమారుడు బాలు చందర్ కి marriage చేశారు. అనితాబాయి Osmania Hospitalలో కాంట్రాక్ట్ లేబర్ స్వీపర్ గా పనిచేస్తోంది.

 రాజు భార్య సంపాదన పైనే ఆధారపడి నిత్యం మద్యం కోసం డబ్బులివ్వమని వేధిస్తున్నాడు. ఈ నెల మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో ఇంటికొచ్చాడు. డబ్బుల కోసం భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై చల్లి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుమారుడు తల్లిని ఉస్మానియాకు తరలించాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. 

ఇదిలా ఉండగా, సోమవారం మంచిర్యాలలో ఓ విచిత్ర ఘటన జరిగింది. liquor తాగడం వల్ల మనిషి ప్రాణాలు నెమ్మదిగా హరిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మద్యం మత్తు మాత్రం క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. ఘోరాలు చేయిస్తుంది. అలాంటి ఘటన Manchiryalaలో జరిగింది. మద్యం మత్తులో నీళ్లు అనుకుని acid ను కలుపుకుని తాగి ఓ వ్యక్తి మృతి చెందిన చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్ల హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్ (29) సింగరేణిలో ఉద్యోగం చేస్తాడు. గతనెల 18న Alcohol intoxicationలో మంచినీరు అనుకుని యాసిడ్ బాటిల్ లోని యాసిడ్ ను మద్యంలో కలుపుకుని తాగాడు. 

దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యలు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న అతను ఈ రోజు మృతి చెందినట్లు హాజీపూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. మహేష్ కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, మే 2న ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. తాగి వచ్చిన మైకంలో భార్యతో గొడవ పడ్డ వ్యక్తి.. ఆమె మీద కోపంతో గొడ్డలి ఎత్తాడు. ఆమె ప్రాణభయంతో పారిపోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. liquor మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి… తన సొంత పిల్లలని కూడా చూడకుండా గొడ్డలికి పని చెప్పాడు. ముగ్గుర్ని తెగనరికి… ఆ తర్వాత ఓ బావిలో పడేశాడు. ఈ దారుణం odishaలో చోటు చేసుకుంది. 

సుందర్ గఢ్ జిల్లా కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు ముండా శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి గొడ్డలితో ఆమెను వెంబడించాడు. ప్రాణ భయంతో ఆమె దాక్కోవడంతో ఇంటికి వచ్చి అభం, శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని సీమ(5), రాజు (2),  ఆరు నెలల చిన్నారిని  గొడ్డలితో నరికి చంపాడు.  ఆ తర్వాత  deadbodyలను బావిలో పడేసి స్థానికంగా ఉండే అడవిలోకి పారిపోయాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?