
Telangana: తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జ్యోతిష్యులు, పూజారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రసవాలకు ముహుర్తాలు పెట్టమని తేల్చి చెబుతున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఫెక్సీలన్నీ అర్చకుల పేరుతో ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయంగా మారింది.
వివరాల్లోకెళ్తే.. గత కొద్ది నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సి-సెక్షన్ శస్త్రచిక్సితల సంఖ్య పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. ప్రజలు వివాహాలు, ఇతర శుభ కార్యాల మారిది.. శిశువుల ప్రసవానికి కూడా నక్షత్రాలు, గ్రహల ఆధారంగా ముహూర్తాలను చూయించుకుంటున్నారు. ఆ ముహూర్తంలో బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలు సి-సెక్షన్ శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే సాధారణ ప్రసవాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వైద్యులు పట్టించుకోకుండా ప్రసవాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఈ విషయం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లాలోని జ్యోతిష్యులు, పురోహితులు, సీనియర్ గైనకాలజిస్టులు, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులతో (సీడీపీఓ) కలెక్టర్ సమావేశం నిర్వహించి, తల్లీ బిడ్డలందరికీ మేలు చేసే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే అంశంపై చర్చించారు.
“సాధారణ ప్రసవం సంక్లిష్టంగా మారినప్పుడు మాత్రమే సి-సెక్షన్ మంచిది. లేకపోతే, ఇది పూర్తిగా అసమంజసమైనది. శిశువులను ప్రసవించడానికి సి-సెక్షన్‌లను నిర్వహించే ఇటువంటి అశాస్త్రీయ అభ్యాసాన్ని నిరుత్సాహపరచాలని జ్యోతిష్యులకు, పురోహితులకు తెలిపారు. డెలివరీ వీలైనంత సాధారణంగా ఉండాలని, అశాస్త్రీయ పద్ధతిలో బిడ్డను ప్రసవించడానికి ఎవరూ కూడా ముహూర్తాలను నిర్ణయించ రాదని ”అని కర్ణన్ అన్నారు.
నిబంధనలు పాటించకుంటే జైలుకే..
అంతేకాకుండా ప్రసవాలకు స్వస్తి పలకాలని అర్చకులు నిర్ణయించడంతో కలెక్టర్, గైనకాలజిస్టులతో కలిసి ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. అన్నీ ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల సమీపంలో ఏర్పాటు చేయబడ్డాయి. అర్చకులు ప్రసవాలు ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎవరైనా ఫోన్ చేసి ముహూర్తం కోరితే వారి వివరాలను ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.