అప్పులపై కొర్రీలు: కేంద్రం తీరుపై తెలంగాణ అసంతృప్తి

Published : May 09, 2022, 09:44 PM IST
అప్పులపై  కొర్రీలు: కేంద్రం తీరుపై తెలంగాణ అసంతృప్తి

సారాంశం

అప్పుల విషయమై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకు రావడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల పేరుతో రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని కోరుతుంది తెలంగాణ.  

హైదరాబాద్: Loans విషయమై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధ: సాగింది. కేంద్రం ఆకస్మాత్తుగా హాఫ్ బడ్జెట్ అని చెప్పడంపై  తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 

సోమవారం నాడు కేంద్ర Finance ఉన్నతాధికారులు రాష్ట్రాల ఆర్ధిక శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ Video  కాన్ఫరెన్స్ లో కేంద్ర ఆర్ధికశాఖ అధికారులతో Telangana ఆర్ధిక శాఖ అధికారులు తమ తమ వాదనలను విన్పించారు. రాష్ట్రాలు ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా అప్పులు తీసుకొంటున్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు చెప్పారు. కార్పోరేషన్లను ఏర్పాటు చేసి అప్పులను  తీసుకొంటున్నారని  కేంద్రం తెలిపింది. కార్పోరేషన్లను ఏర్పాటు చేసి తీసుకున్న అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగా పరిగణిస్తామని కేంద్రం ప్రకటించింది.

మూలధన వ్యయం కోసం corporation నుండి అప్పులు తీసుకుంటున్నామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2020-21 లో రూ. 12 వేల కోట్లు, 2022-23 లోలక్ష కోట్లను రుణాలుగా తీసుకున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తెలంగాణ తీసుకు వచ్చింది.ప్రాజెక్టులు పూర్తయ్యాక అప్పులు తీరుస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హడ్కో, ఎన్‌డీసీ ద్వారా తెచ్చుకున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని  అధికారులు గుర్తు చేశారు.రుణాలకు కొత్త నిబంధనలు ఈ ఏడాది నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ 2020-21 కొత్త నిబంధనను అమలు చేయడం అన్యాయమన్నారు.వెంటనే రాష్ట్రానికి అప్పులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్