
కరీంనగర్ జిల్లా (karimnagar district) తిమ్మాపూర్ మండలం (thimmapur) నేదునూర్‌లో వివాహిత దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భార్యను ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు భర్త నాగరాజు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు... వివాహేతర సంబంధమే (extra marital affair) హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.