BegumBazar Honor Killing : తాతయ్య కళ్లెదుటే నీరజ్ హత్య... ఆరుగురి ప్రమేయం, నిందితుల్లో బాలుడు : డీసీపీ

Siva Kodati |  
Published : May 21, 2022, 09:02 PM ISTUpdated : May 21, 2022, 09:06 PM IST
BegumBazar Honor Killing  : తాతయ్య కళ్లెదుటే నీరజ్ హత్య... ఆరుగురి ప్రమేయం, నిందితుల్లో బాలుడు : డీసీపీ

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బేగంబజార్ పరువు హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. 

బేగంపేట పరువు హత్యకు సంబంధించి నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశామన్నారు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యవర్తుల ద్వారా నిందితులు వున్న ప్రాంతాన్ని గుర్తించామని డీసీపీ వెల్లడించారు. నీరజ్ పన్వార్, సంజన పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. హత్యకు నీరజ్ తాత ప్రత్యక్ష సాక్షి అని డీసీపీ జోయల్ వెల్లడించారు. నీరజ్‌ను ఐదుగురు హత్య చేశారని ఆయన చెప్పారు. నిందితులను అభినందన యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేశ్ యాదవ్‌‌లుగా గుర్తించారు. హత్య కేసులో మొత్తం ఆరుగురి ప్రమేయం వున్నట్లుగా దర్యాప్తులో తేలిందని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా వున్నాడని ఆయన చెప్పారు. 

అంతకుముందు షాహినాథ్‌గంజ్ పీఎస్ (shahinath gunj) వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరువు హత్యకు (BegumBazar Honor Killing ) గురైన నీరజ్ కుటుంబ సభ్యులు (neeraj panwar) బైఠాయించారు. నిందితులను తమ ముందు ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీరజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టానికి తాము ఒప్పుకోమని.. చంపిన వ్యక్తులు, తమకు చూపించే వ్యక్తులు వేరంటూ వారు ఆరోపిస్తున్నారు. 

Also Read;BegumBazar Honor Killing : చంపిన వ్యక్తులు వేరు.. మాకు చూపినవారు వేరు, నీరజ్ కుటుంబ సభ్యుల ఆరోపణలు

ఇకపోతే.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజన (sanjana) సోదరుడితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రోహిత్, రంజిత్, కౌశిక్ , విజయ్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం రెండు బైక్‌లపై వచ్చి నీరజ్‌పై దాడి చేశారు. అనంతరం నీరజ్‌ను కత్తులతో పొడిచి, రాళ్లతో తలపై మోది హత్య చేశారు. హత్య తర్వాత బైక్‌లపై కర్ణాటక పారిపోయారు నిందితులు. సంజన సోదరుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. 

మరోవైపు.. పరువు హత్య కేసుకు సంబంధించి మృతుడు నీరజ్ ప‌న్వార్ భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. నీరజ్ హత్యకు సంబంధించి తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను సంజన తల్లి మ‌ధుబాయి ఖండించారు. ఈ హత్యతో త‌మ కుటుంబానికి సంబంధం లేద‌ని చెప్పారు.  నీరజ్‌ను ఎవరు చంపారో తమకు తెలియదని సంజన తల్లి చెప్పారు. నీరజ్‌ను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో తన కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలియ‌గానే భయంతో ఇంట్లోంచి పారిపోయార‌ని ఆమె తెలిపారు. సంజన దంపతులు సుఖంగా ఉంటే చాలనుకున్నామని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా అల్లుడు నీర‌జ్‌ను చంపుతామ‌ని కొంద‌రు బెదిర‌స్తూ వ‌చ్చార‌ని, వారెవ‌రో మాత్రం త‌మ‌కు తెలియ‌ద‌ని అన్నారు. తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని.. తన అల్లుడిని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్​ చేశారు. సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. ప్రేమ వివాహం ఇష్ట‌లేకే ఏడాది పాటు సంజ‌న‌తో మాట్లాడ‌కుండా దూరంగా పెట్టామ‌ని ఆమె పేర్కొన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సంజనతో రెండు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. సంజన సంతోషంగా ఉంటే చాలని అనుకున్నామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu