అదనపు కట్నం కోసం మహిళా పోలీస్ పై హత్యాయత్నం, బాత్రూం క్లీనింగ్ యాసిడ్ తాగించి....

First Published Jul 12, 2018, 12:57 PM IST
Highlights

అదనపు కట్నం కోసం చట్టాన్ని పరిరక్షించాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ పైనే హత్యాయత్నం జరిగిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. బాత్రూం క్లీనింగ్ కోసం వాడే యాసిడ్ ను బలవంతంగా తాగించి ఆమెను చంపడానికి అత్తింటివారు ప్రయత్రించారు. అయితే వారి నుండి తప్పించుకున్న ఈమె ఆస్పత్రిలో చికిత్స పొందింది. కొద్దిగా కోలుకున్నాక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆల్వాల్ భూదేవి నగర్ కాలనీకి చెందిన సి.రజని(30)  ఎల్బీ నగర్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఈమెకు గత సంవత్సరం 2017లో ఆల్వాల్ లోనే నివాసముండే ఓంప్రకాశ్ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లి సమయంలో రజని కుటుంబసభ్యులు రూ.3 లక్షల  నగదుతో పాటు నాలుగు తులాల బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. 

అయితే పెళ్లి తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్న అత్తింటివారు ఆ తర్వాత తమ అసలు రూపాన్ని బైటపెట్టారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదంటూ, అదనపు కట్నం కావాలని భర్తతో పాటు అత్తామామలు రజనిని వేధించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆమెను అనుమానించడం మొదలుపెట్టారు.

ఈ వేధింపులు శృతిమించి ఈ నెల 9న ఆమెను చంపడానికి భర్త తో పాటు అత్తామామలు ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి సమయంలో రజనిని బంధించిన వారు ఆమె చేత బలవంతంగా బాత్రూం క్లీనింగ్ యాసిడ్ తాగించారు. దీంతో తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమె వారి నుండి తప్పించుకుని సుచిత్ర లోని రష్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంది.

ఆరోగ్యం కాస్త కోలుకున్నాక తనపై జరిగిన హత్యాయత్నం పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తామామలు తనను అదనపు కట్నం పేరుతో శారీరకంగాను, మానసికంగాను హింసించడంతో పాటు హత్యాయత్నం చేశారుని ఫిర్యాదులో పేర్కొంది.  

ఈమె పిర్యాధుతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆల్వాల్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

click me!