స్వగ్రామానికి చేరిన శరత్ మృతదేహం, పలువురు ప్రముఖుల నివాళి

First Published Jul 12, 2018, 11:57 AM IST
Highlights

ఉన్నత చదువుకోసం అమెరికాకు వెళ్లి అక్కడ ఓ దుండగుడి చేతిలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి శరత్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.  విమానంలో మొదట హైదరాబాద్ కు చేరుకున్న మృతదేహాన్ని అక్కడి నుండి రోడ్డుమార్గం ద్వారా వరంగల్ జిల్లాలోని మృతుడి స్వగ్రామం కరీమాబాద్ కి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. 

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో తెలుగు యువకుడు శరత్ పై ఈ నెల 6న ఓ దోపిడీదొంగ కాల్పులు జరిపిన విశయం తెలిసిందే. కాల్పుల్లో గాయపడిన శరత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి విదేశాంగ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపించారు. శరత్ పార్థివ దేహం అమెరికా నుండి బయలుదేరగానే స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బిజెపి మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

దీంతో అతడు శరత్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. మృతదేహం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే బండారు దత్తాత్రేయ, నగర పోలీస్ కమీషనర్ నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.  దీంతో వారు మృతదేహాన్ని స్వగ్రామమైన వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు తరలించారు. 

ఇక వారి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు అతడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. జిల్లా మంత్రి కడియం శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పించి, శరత్ కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు.  

కుటుంబ సభ్యులు, బంధువుల కడసారి చూపు కోసం పెద్ద సంఖ్యలో శరత్ ఇంటికి చేరి అశృనివాళులు అర్పిస్తున్నారు. మృతుడి తల్లి తర కొడుకు జ్ఞాపకాలను తలచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్నవారికి కూడా కన్నీరు తెప్పిస్తోంది.ఇవాళ మద్యాహ్నం అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
click me!