రాములు భార్య శిక్షణ నిమిత్తం రెండు రోజులుగా నల్లగొండలో ఉంటోంది. అయితే, ఈ క్రమంలో ఏమైందో ఏమో తెలియదు కానీ Ramulu ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతు కోసుకున్నాడు.
నల్గొండ : కత్తిపీటతో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నూతన్ కల్ లో ఆదివారం చోటు చేసుకుంది. స్తానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి రాములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతడి భార్య Government employee. వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాములు భార్య శిక్షణ నిమిత్తం రెండు రోజులుగా నల్లగొండలో ఉంటోంది. అయితే, ఈ క్రమంలో ఏమైందో ఏమో తెలియదు కానీ Ramulu ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతు కోసుకున్నాడు.
undefined
ఇంట్లో అలికిడి వినపడడంతో పక్కనే నివాసం ఉంటున్న తండ్రి సాయిలు వెళ్లి చూశాడు. కుమారుడు అప్పటికే Cutlery గొంతు కోసుకుని, రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతుండడంతో కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి రాములును సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన మీద ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
హైద్రాబాద్‌లో మరో సైబర్ మోసం: క్రిఫ్టో కరెన్సీ పేరుతో రూ. 33 లక్షల స్వాహా
విద్యార్థినులకు వేధింపులు..
మంచిర్యాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సినవాడే వారికి సమస్యగా మారాడు. విద్యార్థిణులతో తన ఎదుట పాటలు పాడుతూ డ్యాన్స్ చేయాలని వేధింపులకు దిగాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... mancherial లోని చున్నంబట్టివాడ సాయికుంటలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కొందరు విద్యార్థిణులు చదువుకుంటున్నారు. హాస్టల్లో వుంటూ చదువుకుంటున్న ఈ గిరిజన విద్యార్థుల బాగోగులు చూడాల్సిన గిరిజన సంక్షేమ అధికారి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. మద్యంమత్తులో పాఠశాలకు వచ్చిన సదరు అధికారి క్లాసుల పేరిట విద్యార్థిణిలను క్లాస్ రూంలో తలుపులు, కిటికిలు మూసివేసి వేధింపులకు దిగాడు.
ముఖ్యంగా 9,10 తరగతి విద్యార్థిణిలపై డిటిడివో జనార్ధన్ వేధింపులకు దిగాడు. బోధన పేరిట రాత్రివరకు వారిని పాఠశాలలోనే వుంచడమమే కాదు కొందరిపై చేయిచేసుకున్న అతడు బాలికలందరిని భయపెట్టాడు. తనకు నచ్చినట్లు నడుచుకోకుండే చంపేస్తానని వారిని బెదిరించాడు. తాను మళ్లీ వస్తానని... అప్పుడు పాటలు పాడుతూ తన ఎదుట డ్యాన్స్ లు చేయాలని బాలికలను ఆదేశించాడు.
డిటిడివో harassment తో విసిగిపోయిన బాలికలు ఆందోళనకు దిగారు. తమపట్ల అధికారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని... చంపేస్తానని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేసారు. తమను వేధిస్తున్న అధికారిని వెంటనే విధుల నుండి తొలగించాలంటూ విద్యార్థిణులు ఆందోళన చేపట్టారు.
అయితే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకునివెళతానని స్కూల్ ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో బాలికలు ఆందోళనను విరమించారు. అయినా తమకు న్యాయం జరగలేదంటూ శనివారం మరోసారి విద్యార్థిణులు అల్పాహారం తినకుండా నిరసన తెలిపారు.
హాస్టల్ బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థిణిలతో మాట్లాడిన వారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విద్యార్థిణులు విరమించారు.