దీపావళి 2023 : రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపు లో భారీ అగ్ని ప్రమాదం..

Published : Nov 11, 2023, 07:13 AM ISTUpdated : Nov 11, 2023, 09:17 AM IST
దీపావళి 2023 : రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపు లో భారీ అగ్ని ప్రమాదం..

సారాంశం

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ ఆస్తి నష్టం భారీ స్థాయిలో జరిగినట్టుగా సమాచారం. 

హైదరాబాద్ : శనివారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని ఓ క్రాకర్స్ షాపులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రంగా మారింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, క్రాకర్స్ షాపు పక్కనే ఉన్న ఫుడ్ కోర్టు, పాన్ షాప్, టీ స్టాల్ కు మంటలు అంటుకున్నాయి. ఇవి పూర్తిగా దగ్థం అయిపోయాయి. 

అర్థరాత్రి 12 గంటలవరకు వారు క్రాకర్స్ ను సర్దుకుని పడుకున్నారు. అయితే.. షాపును కొంచెం తీసిపెట్టారు. 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మంటల వేడికి, పొగకు మెలుకువ వచ్చిన షాపులోని వారు తప్పించుకోగలిగారు. అయితే, ఈ క్రాకర్స్ షాపు రేకుల షెడ్డులో టెంట్ హౌస్ గోడౌన్లో ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ హౌస్ కు సంబంధించిన గోదాం పూర్తిగా దగ్థమయ్యింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ ఆస్తి నష్టం భారీ స్థాయిలో జరిగినట్టుగా సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్ర స్తాయిలో ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?