
భువనగిరి: ఇవాళ(గురువారం) తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై(vijayawada-hyderabad national highway) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సు మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతుందనగా ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బస్సు యాదాద్రి భువనగిరి (yadadri bhuvanagiri) జిల్లా లక్కారం సమీపంలోకి రాగానే టిప్పర్ ఢీకొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో బస్సులోని 15మంది ప్రయాణికులతో పాటు ట్రావెల్స్ సిబ్బంది కూడా గాయపడ్డాడు. ఇక లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే బస్సు, లారీ డ్రైవర్లిద్దరికీ తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా వుంది.
read more భర్త మర్మాంగాన్ని కొడవలితో కోసిన భార్య.... చిత్రహింసలు భరించలేక దారుణం.. !
మరోవైపు ఘటనాస్థలంలోనే మరో రోడ్డు ప్రమాదం కూడా చోటుచేసుకుంది. ప్రమాదానికి గురయి రోడ్డుమద్యలో ఆగిన ట్రావెల్స్ బస్సును వెనుక నుండి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు 2కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన రెండు లారీలు, ట్రావెల్స్ బస్సును పక్కకు తీయించడానికి ప్రయత్నిస్తున్నారు.