‘‘జొమాటో అంతా పచ్చి మోసం’’

By ramya neerukondaFirst Published Jan 29, 2019, 2:17 PM IST
Highlights

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మోసాలకు పాల్పడుతోందని బిర్యానీ హౌస్ నిర్వాహకుడు హనస్ బులుకీ ఆరోపించారు.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మోసాలకు పాల్పడుతోందని బిర్యానీ హౌస్ నిర్వాహకుడు హనస్ బులుకీ ఆరోపించారు. చిన్న చిన్న హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకొని.. అకౌంట్స్ వ్యవహారంలో మోసాలు చేస్తోందని మస్తఫా బిర్యీనీ హౌస్ ఓనర్ ఆరోపించారు. సోమవారం గన్ ఫౌండ్రీలోని మీడియా ప్లెస్ ఆడిటోరియంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో హోటళ్లకు సమయానికి డబ్బులు చెల్లించకపోగా.. ఖాతాలో అవకతవకలకు పాల్పడుతోందన్నారు. గతేడాది జొమాటోతో తమ బిర్యానీ డెలివరీ చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. బిర్యానీ డెలివరీ చేసి.. వాటి డబ్బులు సరిగా చెల్లించడం లేదన్నారు.

గత డిసెంబర్ లో తమకు ఎలాంటి సమాచారం అందించకుండా బిర్యానీ సరఫరాపై డిస్కౌంట్లు ప్రకటించారని ఆయన ఆరోపించారు. దీనిపై సంస్థ ప్రతినిధులు అడగగా... సదరు తగ్గించిన మొత్తాన్ని తమ సంస్థ భరిస్తుందని చెప్పారు. తీరా మాకు డబ్బులు చెల్లించాల్సిన సమయం వచ్చే సరికి వేరేవిధంగా మాట్లాడుతున్నారన్నారు. హోటల్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడు రోజుల్లో చెల్లించాల్సిన డబ్బులను 15రోజులైనా ఇవ్వడం లేదని చెప్పారు. 

click me!