బైకులంటే సరదా.. రేస్‌లంటే హాబీ: సొంత బైక్ కోసం దొంగగా

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 1:40 PM IST
Highlights

మార్కెట్లోకి కొత్తగా ఏ బైక్ వచ్చినా దానిపై వెంటనే చక్కర్లు కొట్టాలని చాలామంది యువకుల ఆలోచన. అంతేకాదు కొంతమంది అయితే వాటిపై రేస్‌లకు సైతం వెళుతుంటారు. కానీ అందరికి వచ్చిన ప్రతీ బైక్ కోనేంత ఆర్ధిక స్తోమత ఉండదు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోన్న ఓ యువకుడు బైకులు కొనడానికి దొంగగా మారాడు. 

మార్కెట్లోకి కొత్తగా ఏ బైక్ వచ్చినా దానిపై వెంటనే చక్కర్లు కొట్టాలని చాలామంది యువకుల ఆలోచన. అంతేకాదు కొంతమంది అయితే వాటిపై రేస్‌లకు సైతం వెళుతుంటారు. కానీ అందరికి వచ్చిన ప్రతీ బైక్ కోనేంత ఆర్ధిక స్తోమత ఉండదు.

ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోన్న ఓ యువకుడు బైకులు కొనడానికి దొంగగా మారాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్ధుల్ అమన్ అనే యువకుడు 10వ తరగతి వరకు చదువకున్నాడు.

ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాగా తిరిగేవాడు. ఇతనికి బైకులంటే మోజు...ఖర్చుల కోసం ప్రతిసారి స్నేహితుల ముందు చేయి చాచలేక అమన్ దొంగగా మారాడు. నాలుగేళ్లుగా 8 బైకులను దొంగలించాడు. వాటికి పెట్రోల్ కోసం ఇళ్లు, రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాల్లో నుంచి పెట్రోల్ దొంగతనం చేసేవాడు.

అతన్ని పోలీసులు పలుమార్లు పట్టుకుని జైలుకు పంపారు, అయినప్పటికీ అమలన్ బుద్ధి మాత్రం మారలేదు. మరోవైపు ఫ్రెండ్స్‌తో సరదాగా కబుర్లు చెప్పందుకు తన వద్ద ఫోన్ లేకపోవడంతో ఫోన్‌ల చోరీకి శ్రీకారం చుట్టాడు.

అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్ ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, ఇంటి తలుపులు వేయకుండా బయట నిద్రిస్తున్న వారిని గుర్తించి సెల్‌ఫోన్లతో పాటు నగదును అపహరించేవాడు. అలా ఇప్పటి వరకు 25 సెల్‌ఫోన్లు, రూ.లక్షకు పైగా నగదు చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఫరీద్‌బస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వాచ్‌మెన్ గోపాల్ ఇంట్లోకి చోరబడిన అతను ఖరీదైన సెల్‌ఫోన్, రూ. 11 వేలు తీసుకుని పరారయ్యాడు.

తెల్లవారుజామున దీనిని గమనించిన వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఎంఎస్ మక్తా బస్తీలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఛేజ్ చేసి పట్టుకున్నారు. 
 

click me!