ఇంగ్లీష్ అర్థంకాక విద్యార్థి ఆత్మహత్య...

First Published Jul 26, 2018, 4:40 PM IST
Highlights

అతడి బాల్యం మొత్తం తెలుగు మీడియం పాఠశాలలో సాగింది. కానీ పెద్ద చదువుల్లో తెలుగు మీడియం లేకపోయేసరికి గత్యంతరం లేక ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ ఇంగ్లీష్ లో చెప్పే పాఠాలు అర్థం కాక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

సూర్యాపేట జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన మరళీ కృష్ణ(22) హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేయడానికి హైదరాబాద్ కు వచ్చాడు. ఖైరతాబాద్ లోని ఓ కాలేజీలో జాయిన్ అయిన మురళీ అక్కడికి సమీపంలోని పద్మశాలి కాలనీలో స్నేహితులతో కలిసి నివాసముంటున్నాడు. 

 ఇతడు ఇంగ్లీష్ లో చాలా వీక్. డిగ్రీలోను అన్ని సబ్జెక్టుల్లో ఫాసై కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఫెయిలయ్యాడు.  అయితే హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు లో ఇంగ్లీషులో మాత్రమే పాఠాలు భోదించడంతో మురళికి అసలు ఏం అర్థం కావడంలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తల్లిదండ్రలు ఎంతో నమ్మకంగా తనను హైదరాబాద్ కు పైచదువుల కోసం పంపించారని, వారికి న్యాయం చేయలేకపోతున్నానని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో సాయంత్రం రూం లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిగివచ్చిన రూంమేట్స్ ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్కన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
click me!