శుక్రవారం గ్రహణం, గతంలో చేదు ఘటనల దృష్ట్యా పోలీసులు అప్రమత్తం...

First Published Jul 26, 2018, 1:26 PM IST
Highlights

అరుదుగా సంభవించే ప్రకృతి వింతల్లో ఒకటి శుక్రవారం రోజు గ్రహణం ఏర్పడటం. ఈ రోజు గ్రహణం సందర్భంగా క్షద్ర శక్తులకు బలం పెరిగి, క్షుద్ర పూజలకు అనుకూలంగా ఉంటుందని ప్రజల్లో మూఢనమ్మకం గూడుకట్టుకుని ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని  ఈ  గ్రహణం సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.
 

అరుదుగా సంభవించే ప్రకృతి వింతల్లో ఒకటి శుక్రవారం రోజు గ్రహణం ఏర్పడటం. ఈ రోజు గ్రహణం సందర్భంగా క్షద్ర శక్తులకు బలం పెరిగి, క్షుద్ర పూజలకు అనుకూలంగా ఉంటుందని ప్రజల్లో మూఢనమ్మకం గూడుకట్టుకుని ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని  ఈ  గ్రహణం సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.

గతంలో జనవరి 31వ తేదీన ఇలా శుక్రవారం గ్రహణం సందర్భంగా హైదరాబాద్ లో క్షద్రపూజలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉప్పల్ లో ఓ రెండు నెలల శిశువును క్షుద్ర శక్తులకు బలి ఇచ్చారు. చిన్నారి తలను, మొండెం ను వేరుచేసి వేరు వేరు ప్రాంతాల్లో పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సఈష్టించిన విషయం తెలిసిందే. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును చేధించారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పిల్లలు కలగడం లేదంటూ దంపతులు ఓ కోయ దొరను సంప్రదించగా అతడు ఈ సలహా ఇచ్చినట్లు, కేవలం  శుక్రవారం వచ్చిన గ్రహణం సందర్భంగానే నెలల వయసున్న శిశువును బలి ఇవ్వాలని సూచించాడు. దీంతో ఆ దంపతులు అదే విధంగా చేశారు. ఇదే కాదు, ఈ గ్రహణాల సమయంలో చాలా మంది క్షద్రపూజలు చేపడుతూ పట్టుబడిన అనేక సంఘటనలు గతంలో ఉన్నాయి.  

ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని రేపు మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. అలాగే  ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. తమ పరిసరాల్లో గానీ, తెలిసిన చోట్ల గానీ ఇలా ఎవరైనా అనుమానంగా వ్యవహరిస్తే, పూజలు చేస్తే, రాత్రి సమయంలో సంచరిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ఈ గ్రహణాలను గర్భిణులు చూడవద్దని, కొన్ని భంగిమల్లో పడుకోవద్దని పెద్దలు సూచిస్తుంటారు. అలాగే ఈ సమయంలో భోజనం చేయవద్దని చెబుతుంటారు. అయితే వీటన్నింటిని జన చైతన్య వేధిక వంటి సంస్థలు, ఉన్నత విద్యావంతులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మూడ నమ్మకాల ప్రచారం మాత్రం ఆగడం లేదు.
 
పోలీసులు రేపు గ్రహనం సందర్భంగా ఏవైనా అనుమానిత సంఘటనలు కంటబడితే, వాటి గురించి సమాచారం ఉంటూ వెంటనే డయల్ 100 కు పోన్ చేసి గానీ లేదా వివిధ పోలీస్ సోషల్ మీడియా సైట్ల ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు సూచించారు.  

 

మరిన్ని వార్తల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి

రేపు ఆకాశంలో బ్లడ్ మూన్.. ఏ రాశులవారికి కలిసొస్తుంది.

click me!